NTV Telugu Site icon

Hyundai Creta EV: క్రెటా EV కోసం వెయిటింగ్.. భారత్‌లో రిలీజ్ ఎప్పుడంటే..

Creta Ev

Creta Ev

Hyundai Creta EV: ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే టాటా తన అన్ని కార్లను డిజిల్/పెట్రోల్‌లో సహా ఎలక్ట్రిక్ రూపంలో తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ అవెయింట్ ఈవీ ఏదైనా ఉందా అంటే అది తప్పకుండా హ్యుందాయ్ క్రెటా EV అని చెప్పవచ్చు. ఈ కారు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హ్యుందాయ్‌లో క్రెట్ బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉంది. ఇక ఈవీలో కూడా తన సత్తా చాటుతుందని కంపెనీ భావిస్తోంది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా EVని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY25) నాల్గవ త్రైమాసికంలో దేశంలో విడుదల చేస్తుంది. అంటే, వచ్చే ఏడాది జనవరిలో ఈ కారు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ క్రెటా EV టాటా కర్వ్ EVకి డైరెక్ట్ కాంపిటీషన్‌గా రాబోతోంది. క్రెటా ఈవీ వస్తే, హ్యుందాయ్ నుంచి వచ్చే మూడో ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ప్రస్తుతం హ్యుందాయ్‌లో కోనా ఎలక్ట్రిక్, ఐయోనిక్ 5 ఉన్నాయి.

Read Also: Mallikarjun Kharge: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చుంటే వారంతా జైల్లో ఉండేవారు

అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌లో విలేకరులతో మాట్లాడుతూ, హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ క్రెటా EVని Q4 FY25లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. క్రెటా EV ఉత్పత్తి కోసం తమిళనాడులోని హ్యుందాయ్ యొక్క శ్రీపెరంబుదూర్ ఫ్యాక్టరీలో సన్నాహాలు ప్రారంభించినట్లు కంపెనీ చీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీసర్ గోపాలకృష్ణన్ ఇటీవల చెప్పారు.

ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల వాటా 2.3 శాతంగా ఉంది. ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో 70 శాతం కన్నా ఎక్కువ వాటా కలిగి ఉంది. టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. హ్యుందాయ్ క్రెటా EV శ్రేణి ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో 500కిమీ కంటే ఎక్కువగా ఉంటుందని మేము భావిస్తున్నాము. హ్యుందాయ్ క్రెటా EV ధర దాదాపు రూ. 18 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు.