CAFE 3 Rules India: కొత్త నిబంధనలు.. చిన్న కార్ల ధరలకు రెక్కలు..! ఏంటా రూల్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAFE 3 Rules India: భారత ఆటో రంగంలో త్వరలో అమల్లోకి రానున్న CAFE-3 నిబంధనలు (Corporate Average Fuel Efficiency) చిన్న కార్ల ధరలపై పెద్ద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మధ్యతరగతి వినియోగదారుల కోసం ముఖ్యమైన ఎంపికగా ఉన్న చిన్న కార్లు, ఈ కొత్త నియమాల కారణంగా మరింత ఖరీదైనవిగా మారవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బైక్ నుంచి కారుకు అప్‌గ్రేడ్ కావాలనుకునే వ్యక్తులు తక్కువ ధర, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఉన్న చిన్న కార్లనే ఎంచుకుంటారు. అయితే, రాబోయే రోజుల్లో ఈ సెగ్మెంట్‌పై ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 2025 సెప్టెంబర్‌లో జరిగిన GST తగ్గింపులు చిన్న కార్ల విభాగానికి ఊతమిచ్చాయి. ఆ తగ్గింపుల తర్వాత ఈ సెగ్మెంట్లో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కానీ ఇప్పుడు CAFE-3 నిబంధనలు మళ్లీ ఈ విభాగాన్ని సవాళ్ల ముందుంచుతున్నాయి.
CAFE-3 నిబంధనలు ఏమిటి?
CAFE అంటే కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్యం. ఈ నిబంధనలు వాహనాల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలను తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఒక కంపెనీ తయారు చేసే అన్ని వాహనాల సగటు ఇంధన వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రమాణాలను నిర్ణయిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం, 2027 నుంచి 2032 మధ్యకాలంలో కంపెనీలు తమ వాహనాల సగటు ఇంధన వినియోగాన్ని ప్రతి 100 కిలోమీటర్లకు 3.73 లీటర్ల నుంచి 3.01 లీటర్లకు తగ్గించాలి. ఈ లక్ష్యాలను చేరుకోలేకపోతే కంపెనీలపై జరిమానాలు విధించే అవకాశం ఉంది.
Also Read
- Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
- Kove 650RR: 650cc స్పోర్ట్స్ బైక్‌లో ఫ్రంట్, రియర్ కెమెరాలు.. 108.7hp పవర్‌తో Kove 650RR ఎంట్రీ
- Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
- BYD Denza Z9 GT: భారత్‌లో BYD Denza Z9 GT లాంచ్.. 2.7 సెకన్స్ లో 100 kmph స్పీడ్, 670KM రేంజ్!
చిన్న కార్లపై ప్రభావం ఎలా ఉంటుంది?
గతంలో విడుదల చేసిన ముసాయిదాలో చిన్న కార్లకు (4 మీటర్లలోపు పొడవు, 1200cc ఇంజన్, తక్కువ బరువు) మినహాయింపులు ఇచ్చారు. అయితే, పరిశ్రమలో వచ్చిన అభ్యంతరాల కారణంగా ఈ మినహాయింపులను తొలగించారు. దీంతో చిన్న కార్ల తయారీపై అదనపు ఒత్తిడి పడుతోంది. కొత్త ప్రమాణాలను చేరుకోవడానికి కంపెనీలు మైల్డ్ హైబ్రిడ్ వంటి టెక్నాలజీలను చిన్న కార్లలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇది తయారీ ఖర్చులను పెంచుతుంది. దాంతో వినియోగదారులకు కార్ల ధరలు పెరగడం తప్పదని భావిస్తున్నారు.
ధరలు ఎంత పెరగొచ్చు?
ప్రస్తుత అంచనాల ప్రకారం, CAFE-3 నిబంధనలు అమల్లోకి వస్తే చిన్న కార్ల ధరలు సుమారు 10 శాతం వరకు పెరగవచ్చు. ఇప్పటికే GST తగ్గింపుల వల్ల వచ్చిన లాభం కొంతవరకు తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే, ఈ నిబంధనలను పాటించేందుకు ఆటో కంపెనీలు తమ పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లు, రేంజ్-ఎక్స్టెండర్ వాహనాలను చేర్చాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మొత్తం కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. అయితే, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెట్రోల్ కార్లతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. హైబ్రిడ్ కార్లు కూడా అధిక ధరల కారణంగా అందరికీ అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో కంపెనీలు తక్కువ ధరలో హైబ్రిడ్ టెక్నాలజీ అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా తీసుకొస్తున్న CAFE-3 నిబంధనలు దీర్ఘకాలంలో మంచివే అయినప్పటికీ, తక్షణంలో వినియోగదారులపై ధరల భారం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న కార్ల కొనుగోలుదారులు ఈ ప్రభావాన్ని ఎక్కువగా అనుభవించే అవకాశముంది.
తాజావార్తలు
-
Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
-
Teja Sajja Engagement : తేజ సజ్జా కాబోయే భార్యను చూశారా?
-
Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
-
UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
-
Sabarimala : తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!