BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BYD Denza Z9 GT India Launch Soon: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD లగ్జరీ కార్ బ్రాండ్ Denzaను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఈ బ్రాండ్ భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కంపెనీ తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన Denza Z9 GT టీజర్‌ను విడుదల చేసింది. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లు, శక్తివంతమైన ఎలక్ట్రిక్ పర్ఫార్మెన్స్తో ఈ కారు ఆటోమొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 599 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంటోంది. అంతేకాదు, BYD అందించే 1500 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 5 నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుంచి 70 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని వెల్లడించింది. మరి ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు, డిజైన్, పనితీరు గురించి వివరంగా తెలుసుకుందాం.
Also Read
- Tata Safari EV: టాటా సఫారీ EV వచ్చేస్తోంది.. మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ!
- Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
- Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
- క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కెట్లోకి Hyundai Creta 7-Seater.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..
Denza విడుదల చేసిన టీజర్ చిన్నదే అయినప్పటికీ, అందులో కనిపించిన వివరాలు కారు ప్రత్యేకతను తెలియజేస్తున్నాయి. LED హెడ్‌ల్యాంప్స్, ప్రత్యేకమైన బూట్లిడ్ డిజైన్ ఆధారంగా ఇది Denza Z9 GT అని తెలుస్తోంది. ఈ కారులో ‘Boost Mode’ అనే ప్రత్యేక ఫీచర్ కూడా ఉంది. వేగంగా యాక్సిలరేషన్ అవసరమైనప్పుడు కొంత సమయం పాటు అదనపు పవర్‌ను అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ భారత వెర్షన్లోనూ ఉండే అవకాశం ఉంది. అలాగే ‘Fjord Green’ అనే ప్రత్యేకమైన డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్ కూడా ఈ కారుకు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని అందించనుంది.
Denza Z9 GT సంస్థకు చెందిన ఫ్లాగ్షిప్ మోడళ్లలో ఒకటి. యూరప్‌లోని లగ్జరీ కార్లకు పోటీ ఇచ్చేలా దీనిని రూపొందించారు. ఈ కారు డిజైన్‌లో ప్రధాన ఆకర్షణ షూటింగ్ బ్రేక్ (Shooting Brake) బాడీ స్టైల్. స్పోర్టీగా కనిపించే స్లీక్ రూఫ్‌లైన్, ఆకర్షణీయమైన LED లైటింగ్, ప్రత్యేకమైన వెనుక భాగం డిజైన్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. సాధారణ సెడాన్ కార్లతో పోలిస్తే దీని డిజైన్ చాలా భిన్నంగా ఉంటుంది.
Denza Z9 GTలో ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రీమియం ఇంటీరియర్ అందించారు. ఇందులో ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
రెండు ప్రత్యేకమైన రిఫ్రిజిరేటర్లు.
డిజిటల్ సైడ్ మిర్రర్లు.
1150W పవర్‌తో 20 స్పీకర్ల DEVIALET సౌండ్ సిస్టమ్.
ముందు సీట్లకు 8-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్.
సీట్ హీటింగ్, వెంటిలేషన్ సదుపాయాలు.
10-పాయింట్ మసాజ్ ఫంక్షన్.
యాక్టివ్ సైడ్ బోల్స్టర్ సపోర్ట్.
ఇక డిస్ప్లేల విషయానికి వస్తే 17.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ముందు ప్రయాణికుడి కోసం 13.2 అంగుళాల ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ఉన్నాయి. అంతేకాకుండా ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండు 50W వైర్లెస్ ఫోన్ ఛార్జర్లు కూడా అందించారు. ప్రయాణికుల భద్రత కోసం Denza Z9 GTలో అనేక ఆధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో Level 2+ ADAS (Advanced Driver Assistance Systems), మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, వివిధ ఎలక్ట్రానిక్ సేఫ్టీ సిస్టమ్స్ అందించారు.
ముఖ్యంగా ఇందులోని Vehicle Motion Control (VMC) సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అధిక వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో టైర్ అకస్మాత్తుగా పేలిన సందర్భంలో వాహనంపై నియంత్రణ కోల్పోకుండా ఉండేందుకు ఈ టెక్నాలజీ సహాయపడుతుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంలోనూ టైర్ పంక్చర్ లేదా బ్లోఅవుట్ పరిస్థితుల్లో వాహన స్థిరత్వాన్ని కాపాడేందుకు ఇది రూపొందించారు.
Denza Z9 GT అంతర్జాతీయ మార్కెట్లలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ (EV), ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వెర్షన్లలో అందుబాటులో ఉంది. అయితే భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారులో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండటం మరో ప్రత్యేకత. ఇవి కలిపి 1156 PS పవర్, 1210 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. AWD (All-Wheel Drive) సిస్టమ్‌తో అన్ని చక్రాలకు పవర్ అందుతుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కేవలం 2.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 270 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. అలాగే 63.82 kWh బ్యాటరీ ప్యాక్‌తో WLTP ప్రమాణాల ప్రకారం 599 కిలోమీటర్ల రేంజ్ అందించగలదని వెల్లడించారు. BYDకు చెందిన 1500 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అనుకూలమైన వెర్షన్లో 5 నిమిషాల్లో 10 నుంచి 70 శాతం వరకు ఛార్జింగ్ సాధ్యమవుతుందని కంపెనీ పేర్కొంటోంది.
BYD లగ్జరీ బ్రాండ్ Denza వచ్చే నెలలో భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో Denza Z9 GT కూడా భారత మార్కెట్లోకి వచ్చే అవకాశంపై ఆసక్తి పెరుగుతోంది. అయితే ఈ కారు లాంచ్ తేదీ, భారత వెర్షన్ స్పెసిఫికేషన్లు, ధర, బుకింగ్స్ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
తాజావార్తలు
-
BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
-
Bhutan Lake Burst: భూటాన్‌లో భారీ గ్లేసియర్ సరస్సు బద్దలు.. అసోం, ఉత్తర బెంగాల్‌కు వరద ముప్పు
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!