Site icon NTV Telugu

Car Purchase: బడ్జెట్‌లో కారు కొనాలనుకుంటున్నారా.? అయితే ముందు వీటిని తెలుసుకోండి!

Car Purchase

Car Purchase

Car Purchase: కారు కొనడం ఒక పెద్ద విషయమే.. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఈ విషయంలో చాలా పెద్ద న్యూస్.. నిజానికి బడ్జెట్ కారు కానీ, లగ్జరి కారును తీసుకోవాలనుకుంటే చాలాసార్లు ధరను చూసి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. కానీ నిజమైన విషయాలు చాలానే ఉన్నాయి. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, మైలేజ్, మెయింటెనెన్స్ వంటి ఖర్చులు దీర్ఘకాలంలో మీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతాయి. కాబట్టి సరైన, మంచి నిర్ణయం తీసుకోవడానికి ఏ అంశాలను గమనించాలో ఒకసారి తెలుసుకుందాం.

OnePlus Nord 5 or Poco X7: బడ్జెట్ ఫ్రెండ్లీ బీస్ట్ లేదా ఫీచర్ ప్యాక్డ్ ప్రో.. ఏ మొబైల్ బెస్ట్?

కారు ధరను చూసి ఉత్సాహపడటం సహజం. కానీ కేవలం ధర కాకుండా, దానికి సంబంధించిన ఇతర ఖర్చులను కూడా లెక్కించాలి. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు, పన్నులు, మొదటి సర్వీసింగ్ లేదా చిన్న రిపేర్ ఖర్చులు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీరు లోన్‌పై కారు కొంటే, వడ్డీ రేటు మరియు EMI గురించి జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. కారు కొనే ముందు ఫైనాన్స్ ఆప్షన్లను బాగా పరిశీలించాలి. కొన్నిసార్లు ముందుగానే లోన్ ఆప్రూవల్ తీసుకుంటే తక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే కారు మైలేజ్, ఇన్సూరెన్స్ ప్రీమియం, సంవత్సరానికి వచ్చే సర్వీసింగ్ ఖర్చులను కూడా గమనించాలి. తక్కువ ధరలో కారు కొనడం మంచిదే కానీ.. దాని నడపడం మీ బడ్జెట్‌కు సరిపోవాలి.

క్రూజ్ కంట్రోల్‌, సింగల్ రీఛార్జ్.. 157 కిమీ రేంజ్‌తో Ather 450 Apex లాంచ్.. ధర ఫీచర్లు ఇలా!

కారును కేవలం చూసి కొన్ని విషయాలు నమ్మొద్దు. మొదట దానిని డ్రైవ్ చేసి చూడండి. ఎక్కువ సేపు టెస్ట్ డ్రైవ్ చేయండి. ట్రాఫిక్‌లో క్లచ్, బ్రేకులు, గియర్లు, సస్పెన్షన్ బాగున్నాయో లేదో చూడండి. డ్రైవింగ్ సమయంలో ఏవైనా శబ్దాలు లేదా వైబ్రేషన్లు కనిపిస్తే లోపం సంకేతం కావచ్చు. కాబట్టి ఇలాంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అన్నీ సరిగ్గా అనిపించినా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. నమ్మకమైన మెకానిక్‌తో కారును పూర్తిగా చెక్ చేయించు కోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంజిన్, ట్రాన్స్‌మిషన్, బ్రేకులు, ఎలక్ట్రికల్ సిస్టమ్ మొదలైనవి. ఆ తర్వాత వేర్వేరు డీలర్లు లేదా సేలర్లతో మాట్లాడి ధరను పోల్చండి. చివరగా, వారంటీ షరతులు చదివి సమస్యలు రాకుండా చూసుకోండి.

Exit mobile version