NTV Telugu Site icon

Perfetto EV Scooter: మార్కెట్‌లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 160KMరేంజ్!

Perfetto

Perfetto

ఎలక్ట్రిక్ వెహికల్స్ కు వాహన ప్రియుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలన్నీ లేటెస్ట్ ఫీచర్లతో, స్టన్నింగ్ లుక్ లో ఈవీలను తీసుకొస్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే ఈవీలు లభిస్తుండడంతో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఈవీ కంపెనీ బీఎన్‌సీ మోటర్స్ తన పెర్ఫెట్టో ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిలీజ్ చేసింది. క్లాసిక్ డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.

ఈ స్కూటర్ నాలుగు కలర్స్ లో అందుబాటులో ఉంది. పాంగాంగ్ బ్లూ, నీలగిరి గ్రీన్, టోక్యో రెడ్, వెనెటో వైట్ కలర్స్ లో అందుబాటులో ఉంది. భారత్ లో దీని ధర రూ. 1.13 లక్షలు( ఎక్స్-షోరూమ్). ఈ నెలాఖరు నాటికి స్కూటర్ అందుబాటులోకి రానుంది. ఈ స్కూటర్ చేతక్ మాదిరిగానే నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. దాని మెటల్ బాడీతో ప్రత్యేకంగా నిలుస్తుంది. పెర్ఫెట్టో ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 160కి.మీల దూరం ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. 3.7 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఈ స్కూటర్ గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. స్కూటర్‌లో వెనుకవైపు సింగిల్-సైడెడ్ షాక్ అబ్జార్బర్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. పెర్ఫెట్టో శ్రేణిలో పొడవైన ఫ్లోర్‌బోర్డ్‌ను కలిగి ఉంది, 750 మిమీ పొడవు గల సీటు, సీటు కింద 25-లీటర్ నిల్వ స్థలాన్ని కలిగి ఉంది. స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ BNC ప్రత్యేకమైన Etrol 40 బ్యాటరీతో వస్తుంది.