BMW X6 Facelift: భారత్‌లో BMW X6 ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
- భారత్‌లో BMW X6 ఫేస్‌లిఫ్ట్ లాంచ్
- ఎక్స్-షోరూమ్ ధర రూ.1.78 కోట్లు
- 4.3 సెకన్లలో 100kmph
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ఇండియా తన ప్రీమియం కూపే-SUV BMW X6 ఫేస్‌లిఫ్ట్ ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ లగ్జరీ SUV M60i xDrive వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండగా, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.78 కోట్లుగా నిర్ణయించింది. పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి (CBU) రూపంలో ఈ మోడల్‌ను భారత మార్కెట్లో విక్రయిస్తున్నారు. BMW X6లో 4.4 లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ ను అందించారు. దీనికి 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ కూడా జత చేశారు. ఈ ఇంజిన్… 530hp గరిష్ట పవర్, 750Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో పాటు xDrive ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌ను అందించారు.
4.3 సెకన్లలో 100kmph
BMW ప్రకారం, ఈ లగ్జరీ SUV 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.3 సెకన్లలో అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 250 కిలోమీటర్లు/గంటకు. అత్యుత్తమ పనితీరు కోసం… అడాప్టివ్ సస్పెన్షన్, రియర్-వీల్ స్టీరింగ్, లిమిటెడ్-స్లిప్ డిఫరెన్షియల్, xDrive AWD సిస్టమ్ వంటి అధునాతన డ్రైవింగ్ టెక్నాలజీలను కూడా అందించారు.
Also Read
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
కొత్త డిజైన్.. మరింత స్పోర్టీ లుక్
ఫేస్‌లిఫ్ట్ మోడల్లో BMW అనేక డిజైన్ మార్పులు చేసింది. వాటిలో… అడాప్టివ్ LED హెడ్‌ల్యాంప్స్, సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్, గ్లాస్ బ్లాక్ ORVMలు, 21-అంగుళాల M-స్పెక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, రన్-ఫ్లాట్ టైర్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు
BMW X6 ఈ క్రింది రంగుల్లో అందుబాటులో ఉంది. అవెంచురిన్ రెడ్, మాన్‌హట్టన్ మెటాలిక్, బ్రూక్లిన్ గ్రే, బ్లాక్ సఫైర్, మినరల్ వైట్, ఐల్ ఆఫ్ మ్యాన్ గ్రీన్ లగ్జరీ ఇంటీరియర్, BMW X6 ఇంటీరియర్ పూర్తిగా ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది. ఇందులో… 14.9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, 12.3-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, Curved Display, Head-Up Display (HUD), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్ట్మెంట్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్
సంగీత ప్రియుల కోసం BMW X6లో 464W పవర్‌తో 16-స్పీకర్ల Harman Kardon ప్రీమియం ఆడియో సిస్టమ్ ను అందించారు. అదనంగా… క్రిస్టల్ గ్లాస్ iDrive కంట్రోలర్, ప్రీమియం గేర్ నాబ్, ఆంత్రాసైట్ హెడ్‌లైనర్, ముందు సీట్ల మసాజ్ ఫంక్షన్ వంటి లగ్జరీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధర
భారత మార్కెట్లో BMW X6 M60i xDrive రూ.1.78 కోట్ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
- Tags
- BMW
- BMW X6 Facelift
- india
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!