BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ

  • BGauss C12 MaxR లాంచ్
  • ఒక్క ఛార్జ్‌తో 178 కిమీ రేంజ్
  • ధర రూ.1.46 లక్షలు
Bgauss C12 Maxr

Bgauss C12 Maxr

BGauss C12 MaxR: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో BGauss కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. కంపెనీ తాజాగా BGauss C12 MaxRను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధరను రూ.1.46 లక్షలుగా నిర్ణయించారు. కొత్త C12 MaxRను కంపెనీ రూపొందించిన WSA ప్లాట్‌ఫామ్పై తయారు చేశారు. బలమైన స్టీల్‌తో రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్ దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసినట్లు కంపెనీ చెబుతోంది. సుమారు 1.5 లక్షల కిలోమీటర్ల వరకు వినియోగించేలా దీనిని రూపొందించినట్లు BGauss పేర్కొంది.

BGauss C12 MaxR డిజైన్ ఎలా ఉంది?

C12 MaxR చూడటానికి సాధారణ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ తరహాలో ఉంటుంది. ముందు భాగంలో బాక్సీ డిజైన్‌తో కూడిన హెడ్‌లైట్ యూనిట్ ఉంది. ఇందులో ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్లు అందించారు. స్కూటర్‌కు వెడల్పాటి మిర్రర్లు, క్రోమ్ ఫినిష్ కూడా ఉన్నాయి. పెద్ద ఫ్లోర్‌బోర్డ్ కారణంగా రోజువారీ షాపింగ్ బ్యాగులు, ఇతర సామగ్రిని ఉంచుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. సీటు కూడా పెద్దగా ఉండటంతో రైడర్‌తో పాటు పిలియన్ ప్రయాణికుడికి సౌకర్యంగా ఉండేలా కనిపిస్తుంది. వెనుక భాగంలో LED టెయిల్‌లైట్, టర్న్ ఇండికేటర్లు, వెడల్పాటి గ్రాబ్ రైల్ ఉన్నాయి.

మూడు కలర్ ఆప్షన్లు

Sparkling Wine + Champagne Gold
Terra Green + Champagne Gold
Pearl White + Satin Black

బ్యాటరీ, మోటార్, రేంజ్

C12 MaxRలో 3.8 kWh LFP బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు. దీనికి 4.2 kW సైడ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ను జత చేశారు. కంపెనీ ప్రకారం, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 178 కిలోమీటర్ల వరకు IDC రేంజ్ అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 75 కిలోమీటర్లు.

మూడు రైడింగ్ మోడ్స్

రైడర్ అవసరాలకు అనుగుణంగా ఇందులో మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.

Eco 45 kmph
Ride 60 kmph
Sport 75 kmph

Eco మోడ్‌లో రేంజ్‌కు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. Ride మోడ్ రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండగా, Sport మోడ్‌లో గరిష్టంగా 75 kmph వేగాన్ని అందుకోవచ్చు.

ఛార్జింగ్ సమయం ఎంత?

C12 MaxRతో 750W ఛార్జర్ను కంపెనీ అందిస్తోంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 3 గంటల 50 నిమిషాలు పడుతుంది. పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 5 గంటల 15 నిమిషాలు సమయం పడుతుంది.

స్టోరేజ్, స్మార్ట్ ఫీచర్లు

ఫ్యామిలీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని C12 MaxRలో మంచి స్టోరేజ్ స్పేస్‌ను అందించారు. సీటు కింద పెద్ద స్టోరేజ్ ఏరియాతో పాటు చిన్న వస్తువుల కోసం నాలుగు ప్రత్యేక పాకెట్లు ఉన్నాయి. అదనంగా బూట్ ల్యాంప్ కూడా ఇచ్చారు. టెక్నాలజీ పరంగా ఇందులో 5-అంగుళాల TFT కన్సోల్ ఉంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వివిధ డిస్‌ప్లే థీమ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పార్కింగ్ సమయంలో స్కూటర్‌ను ముందుకు లేదా వెనక్కి తరలించేందుకు రివర్స్ స్విచ్ ఇచ్చారు. క్రూయిజ్ మోడ్, USB Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో కూడా C12 MaxRలో పలు ఫీచర్లను అందించారు. ఇందులో Parental Lock, Secure Lock, SOS, Side-stand Motor Cut-off, Fall Sense
Vehicle Diagnostics, DigiLocker Connectivity వంటి ఫీచర్లు ఉన్నాయి.

12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు

C12 MaxRలో 12-అంగుళాల ట్యూబ్‌లెస్ వీల్స్ ఉన్నాయి. స్కూటర్ సీట్ హైట్ 768 మిల్లీమీటర్లుగా ఉంది. దీని కారణంగా తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు కూడా రైడింగ్ సులభంగా ఉండే అవకాశం ఉంది. స్కూటర్ బరువు 126 కిలోలు. భారతీయ రోడ్లు, గుంతలను దృష్టిలో పెట్టుకుని 160 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అందించారు.

బ్రేకులు, సస్పెన్షన్

బ్రేకింగ్ కోసం ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. అయితే ఇందులో ABS సపోర్ట్ లేదు. సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌ను ఉపయోగించారు. వెనుక భాగంలో 5-స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ ఆఫ్‌సెట్ సస్పెన్షన్ అందించారు.

ధర ఎంత?

BGauss C12 MaxR ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ రూ.1.46 లక్షల ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. 178 కిలోమీటర్ల IDC రేంజ్, 75 kmph టాప్ స్పీడ్, LFP బ్యాటరీ, TFT డిస్‌ప్లే, కనెక్టెడ్ ఫీచర్లతో రోజువారీ కుటుంబ వినియోగాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ స్కూటర్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.