Best SUV cars: సిటీ ట్రాఫిక్‌లోనైనా లేదా వీకెండ్ ట్రిప్స్‌కైనా, ఒక మంచి SUV ప్రయాణించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మరి అలంటి వాటికోసం రూ.20 లక్షల లోపు స్టైలిష్, ఫీచర్లతో నిండిన, నమ్మకమైన SUV కోసం చూస్తున్నట్లయితే.. భారత మార్కెట్లో అనేక అద్భుతమైన ఎంపికలు ఉన్నాయి. ఈ SUVలు స్మార్ట్ డిజైన్, కంఫర్టబుల్ ఇంటీరియర్, బెస్ట్ పనితీరు కలయికతో ప్రతి డ్రైవ్‌ను ఆనందదాయకంగా మారుస్తాయి. మరి ఆ కారులేంటో చూసేద్దామా..
టాటా నెక్సన్: (Tata Nexon)
భారతీయ మార్కెట్లో సేఫ్టీ, కంఫర్ట్ విషయంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న SUV టాటా నెక్సన్ (Tata Nexon). ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో వస్తుంది. ఇది మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటీరియర్‌లో 7 అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, హర్మాన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. దీని ధర రూ.8.50 లక్షల నుంచి రూ.16.50 లక్షల వరకు ఉంటుంది.
Ravichandran Ashwin: బ్యాటర్లను కాపాడటానికి బౌలర్లను బలి చేస్తారా..?
మహీంద్రా XUV300: (Mahindra XUV300)
Mahindra XUV300 సేఫ్టీ, పనితీరు పరంగా బెస్ట్ SUV. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో వస్తుంది. SUVలో ADAS ఫీచర్లు, 7-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉన్నాయి. దీని ఆన్‌రోడ్ ధర రూ.8.50 లక్షల నుంచి రూ.14.50 లక్షల వరకు ఉంటుంది.
హ్యుండాయ్ క్రెటా: (Hyundai Creta):
భారత మార్కెట్లో అత్యంత పాపులర్ SUVలలో హ్యుండాయ్ క్రెటా Hyundai Creta ఒకటి. దీని స్పోర్టీ లుక్, ఫీచర్లతో నిండిన ఇంటీరియర్ వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, CVT, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఫీచర్లలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. దీని ఆన్‌రోడ్ ధర రూ.10.50 లక్షల నుంచి రూ.17.50 లక్షల వరకు ఉంటుంది.
smuggling: ఏంద్రయ్యా.. మరీ అక్కడ ఎలా పెట్టార్రా..
కియా సొనెట్: (Kia Sonet)
స్మార్ట్ డిజైన్, స్టైలిష్ ఎక్స్టీరియర్స్ కోసం ప్రసిద్ధి చెందిన SUV కియా సొనెట్ (Kia Sonet). ఇది 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్స్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉన్నాయి. ఆన్‌రోడ్ ధర రూ.7.50 లక్షల నుంచి రూ.14.50 లక్షల వరకు ఉంటుంది. సిటీ డ్రైవింగ్‌కైనా, వీకెండ్ ట్రిప్స్‌కైనా సొనెట్ ఒక చక్కని ఎంపిక.
మారుతి సుజుకి బ్రిజా (Maruti Suzuki Brezza):
భారతీయ వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్న SUVలలో Maruti Suzuki Brezza ఒకటి. ఇది ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, మెంటెనెన్స్ పరంగా కూడా అద్భుతంగా నిలుస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో ఇది 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. 7-అంగుళాల స్మార్ట్ టచ్‌స్క్రీన్, స్మార్ట్ ప్లే స్టూడియో, వైర్‌లెస్ కనెక్టివిటీ, అలాగే ABS, EBD, ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. దీని ఆన్‌రోడ్ ధర రూ.8.50 లక్షల నుంచి రూ. 13.50 లక్షల వరకు ఉంటుంది.
