Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
- టాప్-5 ఎలక్ట్రిక్ బైక్‌ల జాబితా..
- రూ.1.50 లక్షలలోపు కొనుగోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best EV Bikes: భారతదేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం పెరగడం వంటి కారణాలతో ప్రత్యామ్నాయ రవాణా వాహనాలపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోంది. దీనితో ఇప్పుడు ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు.. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను కొనడానికి ఇష్టపడుతున్నారు. దీనితో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. కాబట్టి రూ.1.50 లక్షలలోపు బడ్జెట్లో మంచి రేంజ్, పనితీరు, ఆధునిక ఫీచర్లతో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ బైక్స్ ఇదిగో..
ఓలా రోడ్‌స్టర్ (Ola Roadster):
ఓలా ఎలక్ట్రిక్ అందిస్తున్న ఓలా రోడ్‌స్టర్ 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.1.05 లక్షల నుంచి రూ.1.40 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ బైక్‌లో 3.5kWh, 4.5kWh, 6kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. అన్ని వేరియంట్లలో 13kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.
Also Read
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
* 3.5kWh బ్యాటరీ: 151 కి.మీ రేంజ్
* 4.5kWh బ్యాటరీ: 190 కి.మీ రేంజ్
* 6kWh బ్యాటరీ: 248 కి.మీ రేంజ్
రివోల్ట్ RV400 (Revolt RV400):
ఈ బైక్‌లో 4.1kW ఎలక్ట్రిక్ మోటార్, 170Nm టార్క్, 3.24kWh బ్యాటరీ ఉన్నాయి. Revolt RV400 ధర రూ.1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ. రేంజ్ ఇవ్వగలదు. ఈ బైక్ టాప్ స్పీడ్ 85 కి.మీ/గం. అలాగే దీనికి 3 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.
రివోల్ట్ RV బ్లేజ్ఎక్స్ (Revolt RV BlazeX):
రివోల్ట్ RV బ్లేజ్ఎక్స్ భారత మార్కెట్లో ఒక్క వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.20 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 3.24kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు 4.1kW ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. ఈ మోటార్ 37.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 150 కి.మీ వరకు రేంజ్ అందించగలదని కంపెనీ పేర్కొంది. అలాగే గరిష్టంగా 85 కి.మీ/గంట టాప్ స్పీడ్‌ను అందిస్తుంది. ఈ బైక్‌పై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 40,000 కి.మీ (ఏది ముందుగా పూర్తైతే అది) వరకు వారంటీ కూడా అందిస్తోంది.
అవోర్ EX (Avore EX):
ఇటీవల భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన Avore EX ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. EX1 ధర రూ.1.25 లక్షలు, EX2 ధర రూ.1.50 లక్షలు, EX2 S ధర రూ.1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో EX1 వేరియంట్లో 3.24kWh బ్యాటరీ ప్యాక్ ఉండగా, EX2 మరియు EX2 S వేరియంట్లలో 5kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి రేంజ్ కూడా మారుతుంది. EX1 ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో 160 కి.మీ, EX2 255 కి.మీ, EX2 S 260 కి.మీ వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. మూడు వేరియంట్లలోనూ గరిష్టంగా 114 కి.మీ/గంట టాప్ స్పీడ్ లభిస్తుంది. ఎక్కువ రేంజ్, మెరుగైన పనితీరు కోరుకునే వినియోగదారులకు Avore EX మంచి ఎంపికగా నిలుస్తుంది.
ఓబెన్ రోర్ (Oben Rorr):
ఈ బైకు భారత మార్కెట్లో ఒక్క వేరియంట్లో అందుబాటులో ఉండగా, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.50 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో 4.4kWh బ్యాటరీ ప్యాక్, 8kW ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. ఈ మోటార్ గరిష్టంగా 50Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 187 కి.మీ వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ బైక్ గంటకు 100 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. కంపెనీ ఈ బైక్‌పై 3 సంవత్సరాలు లేదా 40,000 కి.మీ (ఏది ముందుగా పూర్తైతే అది) వరకు వారంటీ కూడా అందిస్తోంది. మంచి రేంజ్‌తో పాటు వేగవంతమైన పనితీరు కోరుకునే వినియోగదారులకు Oben Rorr మంచి ఎంపికగా నిలుస్తుంది.
ఏ బైక్ ఎవరికి బెస్ట్?
రోజువారీ నగర ప్రయాణాల కోసం మంచి రేంజ్, తక్కువ ధర కోరుకునే వారికి ఓలా రోడ్‌స్టర్, రివోల్ట్ RV బ్లేజ్ఎక్స్ మంచి ఎంపికలు. అలాగే ఎక్కువ రేంజ్ కావాలనుకునే వారు Avore EX2 లేదా Ola Roadster 6kWh వేరియంట్‌ను తీసుకోవచ్చు. మంచి పనితీరు, స్పోర్టీ డిజైన్ కోరుకునే వారికి ఓబెన్ రోర్ ఎంపికగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!