NTV Telugu Site icon

Bajaj CNG Bike: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్ జీ బైక్ ను విడుదల చేసిన బజాజ్.. ధర ఎంతంటే?

Bajaj Cng Bike

Bajaj Cng Bike

బజాజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ ఫ్రీడమ్ 125 ను భారతదేశంలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 95,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. డిస్క్ ఎల్ఈడీ (LED), డ్రమ్ ఎల్ఈడీ(LED), ఫ్రీడమ్‌ డ్రమ్‌ అనే మూడు వేరియంట్‌లలో కంపెనీ దీనిని పరిచయం చేసింది. ఈ బైక్ డ్రమ్ వేరియంట్ ధర రూ.95,000, డ్రమ్ ఎల్ఈడీ ధర రూ.1,05,000 మరియు డిస్క్ ఎల్ఈడీ ధర రూ.1,10,000గా నిర్ణయించింది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ప్రకారం ఉన్నాయి. 125 సీసీ ఇంజిన్‌ కలిగిన ఫ్రీడమ్‌ 125లో 2 కేజీల సీఎన్‌జీ ట్యాంక్‌, 2 లీటర్ల పెట్రోల్‌ ట్యాంక్‌ ఉంటుంది. రెండూ కలిపి 330 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఇంజిన్‌ 9.5 పీఎస్‌ పవర్‌, 9.7 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. సీఎన్‌జీ, పెట్రోల్‌ ట్యాంక్‌ను సీటు కింద అమర్చారు. ఈ బైక్‌ 11 రకాల సేఫ్టీ టెస్టుల్లో పాస్‌ అయ్యిందని కంపెనీ తెలిపింది. ప్రమాదాలు జరిగినప్పుడు సీఎన్‌జీ లీక్‌ కాకుండా భద్రతా పరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. సాధారణ పెట్రోల్‌ బైక్‌తో పోలిస్తే 50 శాతం తక్కువ ఆపరేటింగ్‌ ఖర్చుతో ఈ బైక్‌ నడుస్తుందని, కేవలం ఐదేళ్లలోనే రూ.75వేల వరకు దీంతో ఆదా చేసుకోవచ్చని బజాజ్‌ ఆటో పేర్కొంది.

READ MORE: Home Remedies: స్ట్రెచ్ మార్క్స్ను తొలగించాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటించండి..

ఫ్రీడమ్ 125 CNG బైక్‌లో.. ఎల్ఈడీ (LED) హెడ్‌లైట్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అనేక రకాల క్రాష్ టెస్ట్‌ల ద్వారా ధృవీకరించబడిన బైక్‌కు కంపెనీ అద్భుత డిజైన్‌ను అందించింది. ఈ బైక్‌లో 2 కిలోల సిఎన్‌జి ట్యాంక్ మరియు 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్‌ను అమర్చారు. ఫ్రీడమ్ 125లో 2 లీటర్ CNG ట్యాంక్.. 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉన్నాయి. బైక్‌లో ఇంధనాన్ని ఎంచుకోవడానికి హ్యాండిల్‌పై స్విచ్ కూడా అందించబడింది. ఈ బైక్‌ 330 కిలోమీటర్ల ఫుల్ ట్యాంక్ రేంజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. కంపెనీ త్వరలో బైక్ డెలివరీని ప్రారంభించవచ్చు.