Site icon NTV Telugu

Chetak 3503: తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్‌.!

Chetak 3503

Chetak 3503

Chetak 3503: భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో 2025 కొత్తగా చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్ 35 సిరీస్‌లో భాగంగా లాంచ్ చేసారు. రూ. 1.1 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరతో ఇది ఆ సిరీస్‌లో మోస్ట్ బడ్జెట్-ఫ్రెండ్లీ వెర్షన్‌గా నిలిచింది. చెతక్ 3501, 3502ల కంటే తక్కువ ధరతో, మంచి ఫీచర్లతో అందుబాటులోకి ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. చెతక్ 3503 తక్కువ ధరలోనూ మెరుగైన ఫీచర్లు అందించడంతో వినియోగదారులకు మంచి ఎంపికగా నిలుస్తోంది.

Read Also: 2025 Royal Enfield Hunter 350: కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ లో భారీ మార్పులు.. అప్‌డేట్లు ఇవే!

ఇక ఈ స్కూటర్ టెక్నాలజీ, ఫీచర్ల విషయానికి వస్తే.. తక్కువ ధర ఉన్నప్పటికీ, చెతక్ 3503 ఫీచర్ల పరంగా రాజీ పడలేదు. ఇందులో హిల్ హోల్డ్ అసిస్టు, కలర్ LCD క్లస్టర్ (బ్లూటూత్, మ్యూజిక్ కంట్రోల్, కాల్ మేనేజ్‌మెంట్ సపోర్ట్‌తో), ఇకో తోపాటు స్పోర్ట్స్ రైడ్ మోడ్స్, LED హెడ్‌లైట్ వంటి అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఇందులో సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లాంటి కొన్ని ప్రీమియం ఫీచర్లు లేవు. ఛార్జింగ్ విషయానికి వస్తే.. ఇది 0 నుండి 80% కావాలంటే 3 గంటల 25 నిమిషాలలో ఛార్జ్ అవుతుంది.

Read Also: PBKS vs LSG: సిక్సర్లతో రెచ్చిపోయిన పంజాబ్ బ్యాటర్లు.. లక్నో ముందు భారీ టార్గెట్.!

ఇక చేతక్ 3503 డిజైన్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది. బ్రూక్లిన్ బ్లాక్, ఇండిగో బ్లూ, మ్యాట్ గ్రే, సైబర్ వైట్ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఈ స్కూటర్ ఉంది. కొత్తగా రూపొందించిన 35 సిరీస్ చాసిస్ డిజైన్ ఇందులోనూ ఉంది. దీంతో 35 లీటర్ల భారీ అండర్-సీట్ స్టోరేజ్ కూడా అందుతుంది. ఈ మోడల్‌లో కూడా చెతక్ 3501, 3502ల మాదిరిగా 3.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. అయితే, ధర తగ్గించేందుకు చిన్న మొత్తంలో పెర్ఫార్మెన్స్‌ను తగ్గించారు. ఫలితంగా.. గరిష్ట వేగం 63 కిలోమీటర్లకు పరిమితం చేయబడింది. కానీ, ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత 155 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. చేతక్ 3503 లాంచ్‌తో బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, మరియు శక్తివంతమైన రేంజ్‌తో ఇది వినియోగదారులకు కొత్త ఎంపికలను అందిస్తోంది. మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని బజాజ్ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం, సంస్థ భవిష్యత్తుకు అనుకూలంగా ఉండనుంది.

Exit mobile version