భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఏథర్ ఎనర్జీ’ విక్రయాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఏథర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్తా 2,00,000 అమ్మకాల మైలురాయిని దాటిందని కంపెనీ ప్రకటించింది. మే 2025లో 1,00,000 రిజ్తా యూనిట్లను ఏథర్ విక్రయించగా.. ఆరు నెలల తర్వాత ఆ సంఖ్య 2,00,000కు చేరింది. స్కూటర్ లాంచ్ అయిన 20 నెలల్లోనే కంపెనీ ఈ మైలురాయిని సాధించడం విశేషం. ఇది ఒక గొప్ప విజయం అని కంపెనీ పేర్కొంది.
ఏథర్ ఎనర్జీ విక్రయిస్తున్న వాహనాల్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా రిజ్తా నిలిచింది. 2024 ఏప్రిల్‌లో రిజ్తా లాంచ్ అయింది. ఆ సమయంలో కేవలం దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే రిజ్తా పరిమితమైంది. ఇప్పుడు మధ్య భారతానికి విస్తరించింది. టెర్రకోటా రెడ్ వంటి కొత్త ఎంపికలు, 3.7 kWh బ్యాటరీతో రిజ్తా ఎస్ వేరియంట్ లాంచ్ కూడా అమ్మకాలకు ఎంతగానో దోహదపడింది. మార్కెట్ విస్తరణ ప్రధానంగా దోహదపడిందనే చెప్పాలి. రిజ్తా ఇప్పుడు ఏథర్ మొత్తం అమ్మకాలలో 70 శాతానికి పైగా వాటా ఉంది. అంటే ఈ స్కూటర్‌కు ఎంత డిమాండ్ ఉందో తెలుస్తోంది. నవంబర్ నాటికి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి కీలక రాష్ట్రాల్లో ఏథర్ మార్కెట్ వాటా దాదాపు రెట్టింపు అయింది. Q1 FY26లో 7 శాతం ఉండగా.. Q3 FY26లో 14 శాతానికి చేరుకుంది.
Also Read: Aiden Markram: మా మెయిన్ టర్గెట్ అదే.. ఈసారి అస్సలు వదలం!
పంజాబ్‌లో రిజ్తా అమ్మకాలు 8 శాతం నుంచి 15 శాతానికి, ఉత్తరప్రదేశ్‌లో 4 శాతం నుంచి 10 శాతానికి పెరిగాయి. వాహన్ మరియు తెలంగాణ వెహికల్ ఆన్‌లైన్ అమ్మకాల డేటా ప్రకారం.. ఏథర్ ఇటీవల భారతదేశంలో 5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం ఏథర్ రిజ్తా రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. రిజ్తా ఎస్ 123 కి.మీ, రిజ్తా జడ్ 159 కి.మీ ఐడీసీ రేంజ్‌ను అందిస్తున్నాయి. విశాలమైన సీట్, స్టోరేజీ కెపాసిటీ, లెగ్‌స్పేస్ కారణంగా ఈ స్కూటర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
