Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
- ఆగస్టు 29న ఏథర్ కోనార్క్ లాంచ్.
- కంపెనీకి ఇదే అత్యంత చౌకైన ఈ-స్కూటర్.
- కొత్త EL ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన తొలి మోడల్.
- రూ.1 లక్షలోపు ధర ఉండొచ్చని అంచనా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ather Konark: ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ నుంచి సరికొత్తగా చౌకైన స్కూటర్‌ను తీసుకురాబోతోంది. ‘‘ఏథర్ కోనార్క్’’ ఆగస్టు 29న విడుదల చేయనుంది. కంపెనీ ఇప్పటి వరకు విక్రయించిన స్కూటర్లలో ఇదే అత్యంత చౌకైన మోడల్ అయ్యే అవకాశం ఉంది. ఏథర్ అభివృద్ధి చేసిన కొత్త EL ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందుతున్న తొలి ప్రొడక్షన్ మోడల్ ఇదే. ఈ స్కూటర్‌తో మాస్ మార్కెట్ విభాగంలో మరింత బలంగా అడుగుపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. EL ప్లాట్‌ఫామ్ ఆధారంగా కంపెనీ తయారు చేయనున్న మొదటి ప్రొడక్షన్ మోడల్. మోడల్ విడుదల చేసిన తర్వాతే దీని ధరను ప్రకటించే అవకాశం ఉంది.
డిజైన్ పరంగా కోనార్క్‌లో హ్యాండిల్‌బార్‌పై హెడ్‌ల్యాంప్, ముందు భాగంలో పూర్తి వెడల్పుతో LED DRLs, పెద్ద ఫ్లోర్‌బోర్డ్, పొడవైన సింగిల్-పీస్ సీటు, సన్నని LED టెయిల్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. టాప్ వేరియంట్లలో అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ స్కూటర్లో పాలిమర్ బాడీకి బదులుగా మెటల్ బాడీ ప్యానెల్స్ ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్మాణం వల్ల మరింత బలంగా, మన్నికగా ఉండే అవకాశం ఉంది.
Also Read
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా ప్రకారం.. కొత్త EL ప్లాట్‌ఫామ్ అందుబాటు ధర, సౌకర్యవంతంగా ఉండే డిజైన్, తక్కువ నిర్వహణ ఖర్చు, ఈజీ ఛార్జింగ్, మెరుగైన రీసేల్ విలువ, భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేశామని చెప్పారు. ఏథర్ కోనార్క్ ధర రూ. 1 లక్ష లోపే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Presenting Ather Konarc!
Launching on 29th August 2026 at Ather Community Day. pic.twitter.com/D6uG0bjgpw
— Tarun Mehta (@tarunsmehta) August 5, 2026
తాజావార్తలు
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!