New Kia Seltos: అవతార్‌లో సెకండ్ జనరేషన్ కియా సెల్టోస్(Kia Seltos) అన్‌విల్ అయింది. కొరియన్ కార్ మేకర్ కియా తన ఏస్ మోడల్ సెల్టోస్‌ను మరింత స్టైలిష్‌గా తీర్చిదిద్దింది. సరికొత్త ఫీచర్లు, డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉంది. ఇంటీరియర్, ఫీచర్లు, పవర్ ట్రెయిన్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. డిసెంబర్ 11 నుంచి రూ. 25,000కు బుకింగ్స్ ప్రారంభమవుతాయి. జనవరి 2న ధరల్ని ప్రకటించనున్నారు. కొత్త సెల్టోస్ తన విభాగంలోని టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి విక్టోరిస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్ కార్లకు భారీ కాంపిటీషన్ ఇవ్వబోతోంది.
2026 కియా సెల్టోస్(Kia Seltos)డిజైన్:
కొత్త సెల్టోస్ ఎస్‌యూవీ టైగర్ నోస్ గ్రిల్‌ను కలిగి ఉంది. కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి. టెయిల్ గేట్ డిజైన్ మరింత స్టైలిష్‌గా మారింది. కనెక్టెడ్ టెయిల్ లైట్లు ఇందులో ఉంటాయి. ముందూ వెనక కొత్త బంపర్‌లను ఇచ్చారు. గన్‌మెటల్ ఫినిష్ స్కిడ్ ప్లేట్లతో బంపర్‌లు ఉన్నాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఫ్లాటర్ రూఫ్‌లైన్, పనోరమిక్ సన్‌రూఫ్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నాను కలిగి ఉంది.
కియా తన K3 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా కొత్త సెల్టోస్‌ను తయారుచేసింది. కొలతల్లో కొద్దిగా మార్పులు చోటు చేసుకున్నాయి. గతంతో పోలిస్తే మరింత పొడవుగా కనిపిస్తుంది. ఇది 4,460 mm పొడవు, 1,830 mm పెరిగిన వెడల్పు మరియు 1635 mm ఎత్తును కలిగి ఉంటుంది. వీల్ బేస్8 0 mm పెరిగి ఇప్పుడు 2690 mmకు చేరింది.
2026 కియా సెల్టోస్(Kia Seltos) ఇంటీరియర్:
సెకండ్ జనరేషన్ కియా సెల్టోస్‌లో అప్‌గ్రేడ్ చేయబడిన క్యాబిన్ డిజైన్. కొత్తగా డ్యూయల్ టోన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. లెథరేట్ అప్హోల్స్టరీతో డ్యాష్ బోర్ మరింత లుకింగ్‌గా కనిపిస్తుంది. ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, సింగిల్ కర్వ్డ్ డిస్‌ప్లేతో 30-అంగుళాల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్-స్క్రీన్ సెటప్ అందుబాటులో ఉంది.
New Kia Seltos ఫీచర్లు:
కొత్త అవతార్‌లో సెల్టోస్ మరిన్ని ఫీచర్లతో వస్తోంది.డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే (HUD), పవర్డ్ డ్రైవర్ సీట్లు, మెమరీ ఫంక్షన్ ORVM, ఎనిమిది-స్పీడ్ స్పీడ్ ట్రావెల్ సిస్టమ్‌లతో వస్తుంది. 8-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, వెనుక రిక్లైనింగ్ సీట్లు, స్మార్ట్ ప్రాక్సిమిటీ కీ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
భద్రత కోసం కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, ESP, హిల్-స్టార్ట్ అసిస్ట్, అన్ని వీల్స్‌కు డిస్క్ బ్రేక్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, OTA అప్‌డేట్‌లతో రిమోట్ కంట్రోల్, లెవల్ 2 ADAS ఫీచర్లు, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్-బేస్డ్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్నో, మడ్, సాండ్ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్‌లు ఉన్నాయి.
2026 కియా సెల్టోస్(Kia Seltos) పవర్‌ట్రెయిన్:
కొత్త కియా సెల్టోస్ రెండు పెట్రోల్ ఇంజన్లు, డీజిల్ ఇంజన్లతో వస్తోంది. ఇది 115 hp పవర్,144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ NA పెట్రోల్ ఇంజిన్, 160 hp పవర్, 253 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 116 hpపవర్, 250 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది మ్యానువల్, iVT, DCT, AT వంటి ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కలిగి ఉంది.
