Site icon NTV Telugu

ANCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సాధించిన Toyota Hilux

2025 Toyota Hilux

2025 Toyota Hilux

Toyota Hilux ANCAP 5 Star: ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన పికప్ ట్రక్‌గా పేరుగాంచిన టయోటా హైలక్స్ మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈసారి భద్రత విషయంలో మంచి గుర్తింపును సాధించింది. 2025 టయోటా హైలక్స్ కి ANCAP (ఆస్ట్రేలియా న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) నుంచి పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. హైలక్స్‌పై చేసిన ANCAP పరీక్షలు ప్రమాదాల సమయంలో రక్షణతో పాటు, ప్రమాదం జరగకుండా చేసే సిస్టమ్‌ల పనితీరును కూడా పరిశీలించాయి. పెద్దల భద్రతలో హైలక్స్ 40కి గాను 33.96 పాయింట్లు(84 శాతం రేటింగ్) సాధించింది. ముందు నుంచి, పక్కల నుంచి, పోలుకు ఢీ కొన్నప్పుడు కారు భద్రతను పరిశీలించారు. విప్లాష్ రక్షణ వంటి అనేక పరీక్షల్లో ట్రక్ బలమైన బాడీ నిర్మాణం, సమర్థవంతమైన సీట్‌బెల్ట్ సిస్టమ్‌లతో మంచి ఫలితాలు సాధించింది. పిల్లల భద్రతలో హైలక్స్ మరింత ఆకట్టుకుంది. మొత్తం 49 పాయింట్లలో 44 పాయింట్లు సాధించి 89 శాతం స్కోర్ పొందింది. మెరుగైన సీట్ డిజైన్, బలమైన ISOFIX యాంకరేజ్ వల్ల చిన్నపిల్లలకు మరింత భద్రత కల్పిస్తున్నట్టు స్పష్టమైంది.

READ MORE: చాలా తక్కువ బడ్జెట్ తో ఇండియన్ మార్కెట్లోకి వస్తున్న పోకో C85 5G..

రోడ్డుపై నడిచేవాళ్లు, సైకిల్ తొక్కేవాళ్ల భద్రత విషయంలో హైలక్స్ మంచి ఫలితాలు సాధించింది. ఈ విభాగంలో 82 శాతం స్కోర్ వచ్చింది. పాదచారులు, సైక్లిస్టులు, బైక్‌పై వెళ్లేవాళ్లను గుర్తించి ప్రమాదం జరగకుండా ఆటోమేటిక్‌గా బ్రేక్ వేయగల సిస్టమ్‌లు ఇందులో కీలక పాత్ర పోషించాయి. డ్రైవర్‌కు సహాయం చేసే సేఫ్టీ సిస్టమ్‌ల విభాగంలోనూ హైలక్స్ 82 శాతం స్కోర్ సాధించింది. సీట్‌బెల్ట్ అలర్ట్‌లు, లేన్ సపోర్ట్, స్పీడ్ అసిస్ట్, డ్రైవర్ మానిటరింగ్, ముందు నుంచి లేదా మలుపుల్లో జరిగే ప్రమాదాలను నివారించే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లను ANCAP పరిశీలించింది. ఇవన్నీ కలిసి ప్రమాదం జరగకుండా ముందే అడ్డుకునేలా పనిచేస్తాయి.

READ MORE: The Raja Saab : నెల రోజుల ముందే.. ‘ది రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ!

Exit mobile version