NTV Telugu Site icon

2024 Maruti Suzuki Dzire: 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన మారుతి సుజుకి డిజైర్..

Maruti Suzuki Dzire

Maruti Suzuki Dzire

2024 Maruti Suzuki Dzire: మారుతి సుజుకీ డిజైర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ సెడాన్. ఇప్పుడు సరికొత్త లుక్‌లో రాబోతోంది. మారుతి సుజుకి ఫోర్త్ జనరేషన్ డిజైర్‌ని నవంబర్ 11న రిలీజ్ కాబోతోంది. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు తమ కార్లను మారుతి సుజుకి వెబ్‌సైట్ లేదా డీలర్ షిప్ ద్వారా ప్రీబుక్ చేసుకోవచ్చు.

Read Also: Maharashtra Elections: ధారావి ప్రాజెక్టు చుట్టూ మహారాష్ట్ర రాజకీయాలు..

అయితే, మారుతి కార్లు అంటేనే బిల్ట్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతాయనే ఒక చెడ్డ ఆపవాదు ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ జపాన్ NCAP ద్వారా 4-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను అందుకుంది. అయితే, కొత్త డిజైన్ ఇటీవల గ్లోబల్ NCAP రేటింగ్‌లో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 5-స్టార్ రేటింగ్ అందుకుంది. అయితే, చైల్డ్ సేఫ్టీలో 4-స్టార్ రేటింగ్ పొందింది. 5-స్టార్ రేటింగ్ అందుకున్న తొలి మారుతి కారుగా డిజైర్ హిస్టరీ క్రియేట్ చేసింది.

కొత్త డిజైర్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 24.79 kmpl మరియు AMT బాక్స్‌తో 25.71 kmpl మైలేజీని అందిస్తుంది. CNG వేరియంట్‌లు 33.73 km/kg మైలేజ్ ఇస్తుంది. ఇది LXI, VXI, ZXI మరియు ZXI+ వేరియంట్లను కలిగి ఉంది. మొత్తం 7 కలర్ ఆప్షన్స్ – గాలంట్ రెడ్, జాజికాయ బ్రౌన్, ఆల్యూరింగ్ బ్లూ, బ్లూయిష్ బ్లాక్, మాగ్మా గ్రే, ఆర్కిటిక్ వైట్ మరియు స్ప్లెండిడ్ సిల్వర్‌లను కలిగి ఉన్నాయి.

Show comments