Tata Nexon.ev facelift: టాటా నెక్సాన్ ఈవీ, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్. మొత్తం ఈవీ కార్ల మార్కెట్ లోనే ఎక్కువ యూనిట్లు అమ్ముడవుతూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు కొత్తగా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ గురువారం లాంచ్ అయింది. గతంలో పోలిస్తే స్టైలిష్ లుక్స్ తో, లగ్జరీ ఇంటీరీయర్స్, సన్ రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్ సిస్టమ్ వంటి టెక్ ఫీచర్లతో వచ్చింది.
తాజాగా ఈ రోజు నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ధరల్ని టాటా రివీల్ చేసింది. మీడియం, లాంగ్ రేంజ్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 14.74 లక్షలు(ఎక్స్-షోరూం) నుంచి రూ. 19.94 లక్షల(ఎక్స్-షోరూం) వరకు ఉంది. మొత్తం మూడు ట్రిమ్స్.. క్రియేటివ్, ఫియర్ లెస్, ఎంపవర్డ్ లలో లభ్యమవుతుంది. గతంలో వీటి స్థానంలో ప్రైమ్, మ్యాక్ ఉండేవి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ కారుకి నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ పోటీనిస్తుంది.
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ (మీడియం రేంజ్) ధరలు(ఎక్స్ షోరూం):
క్రియేటివ్+ – రూ. 14.74 లక్షలు
ఫియర్‌లెస్ – రూ.16.19 లక్షలు
ఫియర్‌లెస్+ – రూ. 16.69 లక్షలు
ఫియర్‌లెస్+S – రూ. 17.19 లక్షలు
ఎంపవర్డ్ – రూ. 17.84 లక్షలు
నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (లాంగ్ రేంజ్) ధరలు(ఎక్స్-షొరూం):
ఫియర్‌లెస్ – రూ. 18.19 లక్షలు
ఫియర్‌లెస్ + – రూ. 18.69 లక్షలు
ఫియర్‌లెస్ + – ఎస్ – రూ. 19.19 లక్షలు
ఎంపవర్డ్+ – రూ. 19.94 లక్షలు
Tata Nexon facelift and Nexon EV facelift launched at ₹8.10 lakh and ₹14.74 lakh ex-showroom, respectively. pic.twitter.com/9yWUyrUr21
— Auto News India (ANI) (@TheANI_Official) September 14, 2023
ఫీచర్స్, డిజైన్:
తాజాగా లాంచ్ అయిన నెక్సాన్ ఈవీ , Tata.ev బ్రాండింగ్‌కు అనుగుణంగా Nexon.ev పేరుతో వస్తోంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో కారు ఎక్స్‌టీరియర్స్ చాలా వరకు మార్చారు. చూడటానికి నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్, నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ కవల సోదరుల్లా ఉన్నాయి. గతంలో పోలిస్తే కొత్త నెక్సాన్ ఈవీలో ఎరోడైనమిక్స్ మెరుగయ్యాయి.నెక్సాన్ ఈవీ సింగిల్ టోన్ బాడీ కలర్ గ్రిల్ తో వస్తోంది. ముందు భాగంలో పూర్తిగా పొడవైన LED లైట్స్ తో మరింత అట్రాక్టివ్ గా ఉంది. సీక్వెన్షియల్ LED DRL కలిగి ఉంది. అల్లాయ్ వీల్స్ డిజైన్ మారింది.
లోపల ఇంటీరియర్స్ విషయానికి వస్తే 10.25 ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేతో వస్తోంది. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోని సపోర్ట్ చేస్తుంది. 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, టైప్-సి పోర్ట్‌లు, సన్‌రూఫ్, JBL ఆడియో, వాయిస్ కమాండ్ మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ, రేంజ్:
గతంలో నెక్సాన్ ఈవీలో ప్రైమ్, మ్యాక్స్ స్థానాల్లో మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ వెర్షన్లుగా వస్తున్నాయి. మీడియం రేంజ్(MR) 30 KWh బ్యాటరీతో 325 కి.మీ రేంజ్ ఇస్తే, లాంగ్ రేంజ్( LR) 40.5KWh బ్యాటరీతో 465 కి.మీ రేంజ్ వస్తుంది.గతంలో ఉన్న నెక్సాన్ ఈవీతో పోలిస్తే 12 కి.మీ అదనం. మోటార్ కూడా గతంతో పోలిస్తే 20 కిలోలు తేలికగా ఉంటుంది. లాంగ్ రేంజ్ మోటార్ 144 బీహెచ్‌పీ 215 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తే, మీడియం రేంజ్ 129 బీహెచ్‌పీ సామర్థ్యంతో 215 ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది.
ధర, ఛార్జింగ్ ఆప్షన్స్:
కొత్త నెక్సాన్ ఈవీ 7.2 KW ఏసీ చార్జర్ తో మీడియం రేంజ్ ఈవీని 10 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి 4.3 గంటల సమయం పడుతుంది. అదే లాంగ్ రేంజ్ ఈవీకి 6 గంటల సమయం పడుతుంది. డీసీ చార్జర్ తో కేవలం 56 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ క్రియేటివ్, ఫియర్ లెస్, ఎంపవర్డ్ ట్రిమ్స్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 15 లక్షల-21లక్షల(ఎక్స్ షోరూం) మధ్య ఉంది. ఇది నేరుగా మహీంద్రా XUV 400కి పోటీనిస్తుంది.