ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది.. కొత్త జిల్లాల మార్పుకు సంబంధించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. కొన్ని జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తుండగా.. స్వరూపం మార్చుకోనున్నాయి కొన్ని జిల్లాలు... జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉంది..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో హైడ్రోపవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాటం తీవ్ర రూపం దాలుస్తోంది. అరకులోయ మండలం లోతేరులో సర్వే రాళ్లను ధ్వంసం చేశారు గిరిజనులు.. తమ సంప్రదాయ ఆ యుధాలతో ప్రదర్శన నిర్వహించారు. పవర్ ప్లాంట్లను తరిమి కొడతామని హెచ్చరించడంతో ఏజెన్సీ నివురుగప్పింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్ట్ తీర్పు బీఆర్ఎస్కు బూస్ట్ ఇచ్చిందా? అదే ఊపులో మరో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించిందా? ఈసారి పెద్దల సభవైపు గులాబీ పెద్దల దృష్టి మళ్ళిందా? ఆ దిశగా ఇప్పుడేం చేయాలనుకుంటోంది కారు పార్టీ? ఏంటా సంగతులు? బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న పది మంది శాసనసభ్యుల విషయంలో స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది సుప్రీం కోర్ట్. అయితే…ఈ మూడు నెలల్లోపు […]
కాళేశ్వరం రిపోర్ట్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు... ఏం చేయబోతున్నారు ? సీఎస్ రామకృష్ణారావు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక హరీశ్‌రావుకు ఇస్తారా? అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంటే... అంతకు ముందే కమిషన్ నివేదికపై మాజీ మంత్రి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా ? కాళేశ్వరంపై తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది ?
విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడెవరు ? అధ్యక్షుడి స్థానాన్ని దక్కించుకునేది ఎవరు ? అందరినీ మెప్పించే, నడిపించే సారథిగా ఎవరికి అవకాశం దక్కుతుంది ? కుర్చీని నవతరం అందిపుచ్చుకుంటుందా? పాత సీనియర్లె సారథ్యం వహిస్తారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే అక్కడ వినిపిస్తున్నాయి. ఇంతకీలో పోటీలో ఉన్న నాయకులు ఎవరు ?
రాఖీ పండుగ....గులాబీ పార్టీ ఇంటి గుట్టును బజారున పడేలా చేసిందా ? ఈ పండుగకైనా ఇంటి మనుషులు కలుస్తారేమో అనుకున్న క్యాడర్‌కి...నిరాశే మిగిలిందా ? ఎన్టీవీ వేదికగా రాఖీ కట్టడానికి సిద్ధమని చెల్లెలు చెప్పినా...అన్నయ్య మాత్రం అందుకు ససేమిరా అన్నారా ? అన్నాచెల్లెళ్ల వ్యవహారశైలి...తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఇద్దరి మధ్య వార్ పీక్ స్టేజ్‌కి చేరుకుందా ?
సామాజిక న్యాయం కోసం సాయుధ పోరాటాన్ని నమ్మి అడవిలో పోరుబాట పట్టిన ఆ చెల్లి.. 40 ఏళ్లుగా ప్రతి ఏటా రాఖీ పండుగ రోజున తోడబుట్టిన అన్నను తలుచుకొని రాఖీ కట్టలేక పోతున్నాను అనే బాధను పంటి కింద దిగబట్టుకుని నాలుగు దశాబ్దాల అనంతరం ఈ రోజు తోడబుట్టిన అన్నకు రాఖీ కట్టింది..