Gogikar Sai Krishna
Author- NTV Telugu-
హుజురాబాద్ లో కాంగ్రెస్ గెలుపు తథ్యం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి బల్మూరి వెంకట్ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వాస్తవానికి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలే కుమ్మక్కై రాజకీయం చేస్తున్నాయని, తెలంగాణాలో ఒకరినొకరు తిట్టుకొని ఢిల్లీలో కలుస్తున్నారన్నారు. అంతేకాకుండా కేసీఆర్‌కు దళిత బంధు ఇచ్చే అలోచన లేదని, అది కేవలం ఎన్నికల జిమ్మిక్కేనన్నారు. ఉప ఎన్నికలు ముగిసిన తరువాత […] -
దారుణంః 2 నెలల పసికందు ప్రాణాలు తీసిన తండ్రి..
అనంతపురం జిల్లాలో దుర్ఘటన చోటు చేసుకుంది. తన పోలికలతో లేదని ఓ వ్యక్తి తనకు పుట్టిన శిశువు ప్రాణాలను బలిగొన్నాడు. ఈ హృదయవిదాకర ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణ దుర్గంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కళ్యాణ దుర్గంలో నివాసం ఉంటున్న మల్లికార్జున్ కు రెండు నెలల క్రితం పాప పుట్టింది. అయితే పాపకు తన పోలికలు లేవని తరుచూ భార్యతో మల్లికార్జున్ గొడవు దిగేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యతో గొడవపడి […] -
సీఎం జగన్ మరో నిర్ణయం.. వారికి రూ.10వేలు అర్థిక సహాయం..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. తాజాగా పేద బ్రహ్మణులకు ఆర్థిక సహాయం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పేద బ్రహ్మణుల అంత్యక్రియలకు ప్రభుత్వం గరుడ సహాయ పథకం కింద రూ.10 వేల ఆర్థిక సహాయం ఇవ్వనుంది. ఈ పథకానికి రూ.75 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. అంతేకాకుండా మరణించిన 40 రోజుల లోపు […] -
చెరువులో లభ్యమైన అనీష్ మృతదేహం.. అసలేం జరిగింది..?
రాజేంద్రనగర్‌లోని హైదర్ గూడకు చెందిన అనీష్ మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. నిన్న మధ్యాహ్నం ఆడుకునేందుకు అపార్ట్మెంట్ సెల్లార్‌కు వెళ్లిన అనీష్ కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని అనీష్ తల్లిదండ్రులు సాయంత్రం గుర్తించి పోలీసులకు ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా అనీష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ముందుగా ఓ మహిళ కిడ్నాప్ చేసినట్లు భావించిన పోలీసులు అది నిజం కాకపోవడంతో హైదర్ గూడ పరిసరాలను తనిఖీ చేశారు. దీంతో […] -
వరంగల్ ను పర్యాటక కేంద్రంగా మారుస్తాం : కిషన్ రెడ్డి
కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాను పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామి ఇచ్చారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు టూర్ ఆపరేటర్స్‌కు రూ.10లక్షల రుణాలు బ్యాంకుల ద్వారా అందింస్తామని తెలిపారు. మేడారం జాతరను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పిన కిషన్‌రెడ్డి, మేడారం జాతర గురించి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా ప్రచారం చేస్తామన్నారు. అంతేకాకుండా తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని, అభివృద్ధి […] -
సరూర్ నగర్ ఎస్సై సస్పెండ్.. ఎందుకంటే..?
హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఎస్సై బీ.సైదులును సస్పెండ్ చేసినట్లు రాచకొండి కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. పలు కేసుల విషయంలో ఆరోపణలు, క్రిమినల్ కేసుల్లో సెటిల్మెంట్ లు చేస్తున్నట్లు తేలడంతో ఎస్సై సైదులును సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పోలీసులు పారదర్శకతతో విధులు నిర్వహించాలని, ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. తప్పు చేస్తే ఎవ్వరికైనా శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. -
రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభిరామ్..
ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి పట్టాభిరామ్ ను విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు, గురువారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న న్యాయమూర్తి మూర్తి పట్టాభిరామ్ కు నవంబర్ 2 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పట్టాభిరామ్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఈ రోజు ఉదయం తరలించారు. […] -
పుట్టినరోజు వేడుకల్లో గంజాయి.. పడ్డుబట్ట యువతీయువకులు
ఓ హార్స్ రైడింగ్ క్లబ్ లో అనుమతి లేకుండా పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండడంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మద్యం, గంజాయి మత్తులో యువతీ యువకులు పట్టుబడ్డ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్వోటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ సమీపంలోని ఓ హర్స్ రైడింగ్ క్లబ్లో ఎలాంటి అనుమతులు లేకుండా బుధవారం అర్థరాత్రి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ విషయంపై సమాచారం అందడంతో […] -
యాదాద్రి ఆలయానికి 36కిలోల బంగారం..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పునఃనిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. వందల కోట్ల నిధులతో యాదాద్రి ఆలయాన్ని ప్రపంచంలోనే ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిభ కలిగిన శిల్పకారులతో ఆలయంలోని స్థంభాలు డిజైన్ చేయిస్తున్నారు. యాదాద్రి ఆలయంలో అడుగడుగునా అబ్బురపరిచే కళానైపుణ్యం దర్శనమిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే యాదాద్రి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం దాతలు బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 36.16 కిలోల బంగారాన్ని దాతలు విరాళంగా […] -
జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న మోడీ…
కరోనా మహమ్మరి ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసింది. కరోనా బారినపడి ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. కరోనాతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్దాయి. కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం కొవిడ్ టీకాలను తీసుకువచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీకా ఉత్సవ్ విజయవంతమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా తరువాత 100 కోట్ల కొవిడ్ టీకాలు పంపిణీ మైలురాయి దాటిన రెండవ దేశంగా భారతదేశం చరిత్ర లిఖించింది. అంతేకాకుండా కొవిడ్ టీకాలపై అపోహలు పక్కన పెట్టి […]
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!