Off The Record: తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కొంతమేరకైనా… అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ కేంద్ర నాయకత్వం… ఇక్కడ మాత్రం అస్సలు టచ్ చేయలేదు. ఓవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ దూసుకుపోతుంటే… తాము మాత్రం ఏ క్లారిటీ లేక కామ్‌గా చూస్తూ ఉండాల్సి వస్తోందని బాధ పడుతున్నారట తెలంగాణ కాషాయ నేతలు. ఎందుకిలా జరుగుతోంది? ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారని ఆరా తీస్తున్న నేతలకు వెయిట్…. వెయిట్… ఒకటి రెండు రోజుల్లో మీ నంబర్ […]
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. షెడ్యూల్ వచ్చాక అగ్ర నాయకులందరినీ తిప్పాలని డిసైడ్ అయింది. ఇక్కడ కూడా కర్ణాటక తరహాలోనే కాంగ్రెస్ ముఖ్య నాయకులందరితో ముమ్మరంగా ప్రచారం చేయించాలని నిర్ణయించింది. రాహుల్ గాంధీ, ప్రియాంకల ప్రచార పర్వం మొదలైపోయింది. మహిళా సమస్యలపై ములుగు సభలో చర్చించారు ఇద్దరు అగ్రనేతలు. ఇదే వేదిక నుంచి మహిళలకు భరోసా ఇచ్చింది కాంగ్రెస్. ములుగు సభ తర్వాత ప్రియాంక ఢిల్లీ వెళ్ళగా…. రాహుల్ వరుసగా […]
Off The Record: ప్రకాశం జిల్లాలో వైసీపీ మీద గట్టి పట్టున్న నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి… రెండు పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేశారాయన. అయితే గత మంత్రివర్గ విస్తరణ సమయం నుంచి జరుగుతున్న పరిణమాలు ఆయనను అంతర్మధనంలో పడేశాయి. సొంత వాళ్లే గోతులు తీస్తున్నారంటూ విరక్తితో సైలెంటై పోయారు. అయితే… ఇటీవల పర్యటనకు వచ్చిన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి జిల్లాలో ఇక నుంచి అంతా బాలినేని చేతుల మీదుగానే […]
Story Board: ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా నిలువనున్న ఈ అసెంబ్లీ సమరాన్ని పార్టీలన్నీ సీరియస్‌గా తీసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌కు.. ఇది నిజంగా అగ్ని పరీక్షే. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలో నవంబర్ 7 నుంచి 30 వరకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2018 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మెజారిటీ ఉండి, ప్రభుత్వాన్ని స్థాపించినప్పటికీ.. తిరుగుబాటు జ్వాలలతో దానిని కాపాడుకోలేక, […]
Off The Record: మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్లో గ్రూప్ వార్ పెరిగింది. టికెట్ల ప్రకటన తర్వాత నారాజ్‌గా ఉన్నారు పలువురు నాయకులు. అలాంటి వాళ్ళు పార్టీ మారతారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో అధిష్టానం దూతలు రంగంలోకి దిగి మేటర్ని సెటిల్ చేసే పనిలో ఉన్నారట. మంచిర్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్‌రావుని మార్చాలని పట్టుబట్టారు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి. ఆయన టికెట్ ఇస్తే తన వర్గం సహకరించబోదని కూడా తేల్చేశారు. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ […]
Off The Record: పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన.. టీడీపీ నేతల్లో మాంచి ఊపు తెచ్చింది. చంద్రబాబు అరెస్ట్‌తో డీలా పడిపోయిన పార్టీకి ఓ విధంగా పవన్ తన పొత్తు ప్రకటనతో బూస్టప్ ఇచ్చారనే చెప్పాలి. ఇదే సందర్భంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని కొందరు నేతల్లో గుబులు పెరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు అడిగితే…. చంద్రబాబు కూడా కాదనలేక ఇచ్చేస్తే…. మా పరిస్థితేంటన్నది వారి ఆందోళన. తెలుగుదేశం […]
Off The Record: ఎన్నికలు ఎప్పుడొచ్చినా…. ఉత్తరాంధ్రలో ఒక స్లోగన్ మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది. స్ధానిక నాయకత్వానికే పెద్దపీట వేయాలంటూ గొంతెత్తుతారు విద్యావంతులు. ముందైతే ఊపుగా చర్చోపచర్చలు జరుగుతాయిగానీ… తీరా ఎన్నికల తెర మీదికి వచ్చేసరికి అంతా సైలెంట్ అయిపోతారు. కానీ… తొలిసారిగా ఇదో రాజకీయ నినాదంగా మారబోవడమే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ మీద కొత్త డిబేట్ మొదలైంది. రాజధాని మార్పు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై రకరకాల చర్చలు […]