కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 1,20,529 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,94,879 కి చేరింది. ఇందులో 2,67,95,549 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,55,248 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 3,380 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,44,082 కి చేరింది. ఇక ఇదిలా […]
ప్రస్తుతం తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత కారణంగా వ్యాక్సినేషన్ నెమ్మిదిగా సాగుతుంది. ఇక ఈరోజు నుండి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వ్యాక్సినేషన్ కోసం వచ్చే విద్యార్థులు పాస్ పోర్ట్, వీసాలు తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. అయితే నారాయణగూడ ఐసీఎం ఆవరణలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనున్నట్లు పేర్కొన్నారు. అయితే తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్న విషయం తెలిసిందే. రోజుకు రెండు వేలకు పైగా కరోనా కేసులు […]
తమిళనాడులో కరోనాతో సింహం మృతిపై విచారణకు ఆదేశించారు అధికారులు. వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నీలా అనే తొమ్మిది సంవత్సరాల ఆడ సింహం కరోనాతో మృతి చెందింది. మొత్తం 11 సింహాలలో 9 సింహాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ లాక్ డౌన్ కారణంగా గత నెల రోజుల జూ మూసి ఉంది. జూ సిబ్బంది మొత్తం వ్యాక్సినేషను వేసుకున్నావరే… ఎవరికి కరోనా సోకలేదు… మరి […]
కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య మందు తయారీ కోసం వనమూలికలను ట్రాక్టర్ లలో తరలిస్తున్నారు. వేప,మామిడి,నేరుడు ఆకులు,జిల్లేడు పులును వెంకటాచలం అడవి ప్రాంతం నుంచి కృష్ణపట్నం పోర్టు కు తరలిస్తున్నారు. అయితే సోమవారం నుంచి మందు పంపిణీ చేయనుండగా.. దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆనందయ్య. ఇక ప్రస్తుతం కృష్ణ పట్నం గ్రామంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. స్థానికులను తప్ప ఇతరుల్ని గ్రామంలోకి రానివ్వడం లేదు పోలీసులు. కృష్ణపట్నం పోర్టులో మందు తయారీలో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులు […]
ఐపీఎల్ 2021 వాయిదా కారణంగా విరామం దొరకడంతో మళ్ళీ స్పూఫ్ వీడియోలను ప్రారంభించాడు డేవిడ్ వార్నర్. మొదటి లాక్ డౌన్ సమయంలో వీటితో రెచ్చిపోయిన వార్నర్… మళ్ళీ మ్యాచ్ లు ప్రారంభం కావడంతో వీటికి ఈ మధ్య కొంత గ్యాప్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం చేసిన వీడియోలో ఆలియా భట్ తో స్టెప్పులు వేసాడు వార్నర్. టైగర్ ష్రాప్ నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలోని పాటకు స్టెప్పులేసిన స్పూఫ్ వీడియోను ఇన్‌స్టా వేదికగా అభోమానులతో […]
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి.. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ఇక ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరిగి రూ. 45,500 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 పెరిగి రూ.49,640 కి […]
మేషం : ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. క్రయ, విక్రయ రంగాల వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. ఆత్మీయులకు విలువైన బహుమతులు అందిస్తారు. వ్యాపారస్తులకు ప్రభుత్వ అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. వృషభం : నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు ఫలించక పోవచ్చు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో […]
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు ఏపీసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్, ఆ పార్టి నేతలు. ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్ వేయాలని, కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని గవర్నర్ కు వినతి పత్రం అందచేసిన సాకే శైలజానాథ్ అనంతరం మాట్లాడుతూ… దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి. మాటలు చెప్పకుండా ఏకీక్రుత విధానంలో వ్యాక్సినేషన్ ఇవ్వాలి. భారత్ బయోటెక్ మంచి నీటి బాటిల్ కన్నా తక్కువ ధరకు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. కానీ ధరలు పెంచి విపరీతంగా దండుకుంటున్నారు. […]
సీఎం జగన్ ఆదేశాలతో 15 రోజుల్లో తాడిపత్రిలో యుద్ధప్రాతిపదికన 500 ఆక్సిజన్ పడకల ఆసుపత్రి నిర్మించారు. మరి కాసేపట్లో వర్చువల్ ద్వారా తాడిపత్రి కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్… 5.50 కోట్ల రూపాయల వ్యయంతో 13.56 ఎకరాల్లో కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం చేసారు. జర్మన్ హ్యాంగర్ విధానంలో ఆసుపత్రి నిర్మించారు. దీంతో రాయలసీమ కోవిడ్ బాధితులకు అందుబాటులోకి మరిన్ని ఆక్సిజన్ బెడ్స్ రానున్నాయి. అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల ప్రజలకు […]