NTV Telugu Site icon

క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు మండ‌లాల వారీగా యాక్ష‌న్ ప్లాన్..!

COVID

కరోనా వ్యాప్తి నివారణకు, చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు మండలాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్యారోగ్య శాఖ.. దీనికోసం కరోనా యాక్టీవ్‌ కేసుల సంఖ్యను మండలాలు, అర్బన్‌ ప్రాంతాల వారీగా సిద్ధం చేసింది స‌ర్కార్.. ఏపీలోని 68 మండలాల్లో వందకుపైగా యాక్టీవ్‌ కేసులు ఉన్న‌ట్టు గుర్తించారు.. అత్యధికంగా 196 మండలాల్లో 25 నుంచి 49 యాక్టీవ్‌ కేసులు ఉండ‌గా.. అత్యల్పంగా 18 మండలాల్లో 0-4 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.. ఇక‌, 41 మండలాల్లో 5-9 కేసులుంటే.. 40 మండలాల్లో 10-14 యాక్టీవ్‌ కేసులు, 49 మండలాల్లో 15-19 యాక్టీవ్‌ కేసులు, 47 మండలాల్లో 20-24 యాక్టీవ్‌ కేసులు ఉన్న‌ట్టు తేల్చారు.. 111 మండలాల్లో 50-74 యాక్టీవ్‌ కేసులు, 74 మండలాల్లో 75-100 యాక్టీవ్‌ కేసులున్నట్టు గుర్తించింది వైద్యారోగ్య‌శాఖ‌.. ఇక‌, అర్బన్‌ ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు ఎక్క‌వ‌గా ఉన్న సిటీల విష‌యానికి వ‌స్తే.. విశాఖ నగరంలో 1,168, రాజమండ్రిలో 594, విజయవాడలో 512 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.. మ‌రోవైపు అతిత‌క్కువ‌గా అద్దంకిలో 80, కందుకూరులో 72, పలాస-కాశీబుగ్గలో 69 యాక్టీవ్‌ కేసులు ఉన్న‌ట్టు తేల్చారు.. యాక్టీవ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు అధికారులు.