YV Subbareddy Talks About Srinivasa Sethu Flyover: టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను చైర్మన వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. అలిపిరి వద్ద చిన్నపిల్లల పీడియాట్రిక్ ఆసుపత్రి, అలిపిరి చెక్ పాయింట్, శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. జూన్ నెలాఖరు నాటికి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు పూర్తవుతాయని అన్నారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం చేస్తామన్నారు. 65 శాతం టీటీడీ నిధులతో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర నిర్మాణం పనులు పూర్తి కాగానే.. భక్తులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే.. తిరుపతిలో ట్రాఫిక్ సమస్య ఉండదని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి అలిపిరి వద్ద నిర్మిస్తున్న చిన్నపిల్లల పీడియాట్రిక్ హాస్పిటల్‌ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. తిరుమల ఘాట్ రోడ్‌లో వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. ఘాట్ రోడ్‌లో వెళ్లేందుకు ఫిట్నెస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద మరో మూడు తనిఖీ లైన్‌లు అందుబాటులోకి తీసుకొస్తామని.. అత్యాధునిక స్కానింగ్ యంత్రాలతో తనిఖీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
Balineni Srinivas Reddy: పార్టీవారే ఇబ్బంది పెట్టారు.. సీఎంతో దాని గురించే చర్చించా
అలాగే.. గోవిందరాజస్వామీ ఆలయంలో రావిచెట్టు పడిపోయి మృతిచెందిన డాక్టర్ గుర్రప్ప కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాలి వాన భారీగా రావడంతో.. ఆ రావిచెట్టు పడిపోయిందన్నారు. ఈ ఘటనలో.. కడపకు చెందిన డాక్టర్ గుర్రప్ప మృదిచెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అ కుటుంబానికి జరిగిన బాధను భర్తీ చేయలేమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిజేస్తున్నానన్నారు. ఈ ఘటనలో ఒకరికి కాలు, మరొకరికి తలకు గాయాలయ్యాయని.. గాయపడిన వారికి మెరుగైన వైద్యను అందించాలని ఆదేశించానని అన్నారు. కాగా.. గత నెల 25వ తేదిన గోవిందరాజస్వామి ఆలయంలో మహసంప్రోక్షణను టీటీడీ నిర్వహించింది. 26వ తేది నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
Pakistan: చంద్రుడిని చూసినమని అబద్ధం చెప్తే పాకిస్తాన్ లో 10 లక్షల జరిమానా