ఏపీలో వైఎస్ జగన్ (Cm Jaganmohan Reddy) ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్సీ సామాజిక వర్గాలను కన్సాలిడేట్ చేసే కసరత్తు ప్రారంభించింది వైసీపీ. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల (Sajjala Ramakrishna Reddy) నేతృత్వంలో ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఎస్సీ సెల్ అధ్యక్షులు నందిగం సురేష్ (Nandigam suresh), జూపూడి ప్రభాకర్, మంత్రి పినిపె విశ్వరూప్ హాజరయ్యారు.
DK Aruna : యాదాద్రి పేరుతో వందల కోట్ల ధనాన్ని మింగారు
ఎస్సీ సెల్ అధ్యక్షుడు నందిగం సురేష్ మాట్లాడుతూ.. ఎస్సీ సెల్ నేతృత్వంలో కార్యాచరణ సిద్ధం అవుతోందన్నారు. వారం, పదిరోజుల్లో ఎస్సీ వర్గాలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తాం అన్నారు ఎంపీ సురేష్. ఈ నెలాఖరులోపు రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీల నియామకం పూర్తి చేస్తాం. ఎవరైనా దళితుడిగా పుట్టాలను కుంటారా అని అవమానించిన వ్యక్తి చంద్రబాబు.
వచ్చే రెండు, మూడు నెలల పాటు ఇద్దరు అధ్యక్షులం అంతా రాష్ట్ర స్థాయి పర్యటన చేస్తాం అన్నారు. ఈ మూడేళ్లలో జగన్ ప్రభుత్వం ఈ వర్గాలకు చేసిన ప్రయోజనాలను వివరిస్తాం అన్నారు నందిగం సురేష్. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్సీలకు అన్ని పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. జగన్ అధికారంలోకి రావడానికి ఎస్పీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలే కారణం. అందుకే తన మంత్రివర్గంలో, స్థానిక సంస్థల పదవుల్లో వారికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు జగన్. సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వడంలో దేశంలోనే జగన్ ముందువరుసలో వున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
