Site icon NTV Telugu

YSRCP Plenary LIVE Updates: వైసీపీ ప్లీనరీ ఘనంగా ప్రారంభం.. ఎజెండా ఇదే!

235d88a3 Eeb8 4da0 8860 B1a03134e07e

235d88a3 Eeb8 4da0 8860 B1a03134e07e

Live: CM YS Jagan Speech Live | YSRCP Plenary 2022 | Ntv

 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ప్లీనరీ పండుగకు సర్వం సిద్ధం అయింది. రెండురోజుల పాటు ప్లీనరీ అంగరంగవైభవంగా జరగనుంది. తొలిరోజు ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 గంటల10 నిమిషాలకు పార్టీ జెండాను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించనున్నారు. 10:15 గంటల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్ధనలు జరగనున్నాయి. 10:30 గంటలకు దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. తరువాత సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. ఉదయం 10:55 గంటలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల కానుంది. ఈ ప్రకటనను పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేయనున్నారు.

The liveblog has ended.
  • 08 Jul 2022 05:36 PM (IST)

    తొలిరోజు ముగిసిన ప్లీనరీ

    ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు అంబరాన్ని తాకుతున్నాయి.. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరుగుతోన్న ప్లీనరీ ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది.. ప్రభుత్వ పథకాలు, వాటి ప్రాధాన్యత, అమలు తీరును వివరిస్తూ.. తమ నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. వైసీపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు మంత్రులు.. ఇక, కీలక తీర్మానాలు ప్రవేశపెట్టడం, ఆమోదం తెలపడం కూడా జరిగాయి.. కీలక నేతలు ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే.. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు.. మొత్తంగా ఉల్లాసవంతమైన వాతావరణంలో తొలిరోజు ప్లీనరీ సమావేశాలు ముగిశాయి.

  • 08 Jul 2022 05:14 PM (IST)

    నా గుండె చీల్చినా జగనన్నే ఉంటారు..

    నా మంత్రి పదవి పీకేశారు.. పక్కన పెట్టేశారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.. మాకు పదవులు ముఖ్యం కాదు.. జగనన్నే ముఖ్యం.. నా గుండె చీల్చినా జగనన్నే ఉంటారు అని ప్రకటించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌.. తొలిరోజు ప్లీనరీ వేదికగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం, సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.. చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడికి ఇదే మా హెచ్చరిక.. మాకు ఎవరూ అవసరం లేదు.. జగనన్న ఒక కను సైగ చేస్తే.. చేప చర్మం వలచినట్టు ఒక్కొక్కడి చర్మం వలిచేస్తామని హెచ్చరించారు..

  • 08 Jul 2022 04:54 PM (IST)

    ఓడిపోయే టీడీపీకి మాటలు ఎక్కువ..!

    ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.. ఓడిపోయే టీడీపీకి మాటలు ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు ఏపీ మంత్రి విడదల రజిని.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ మూడో ప్లీనరీలో ఆమె మాట్లాడుతూ.. ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందించి చరిత్ర సృష్టించిన నేత సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.. ఆరోగ్యశ్రీకి చంద్రబాబు ఉరేస్తే.. సీఎం జగన్‌ ఆరోగ్యానికి ఊపిరి పోశారని పేర్కొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం, ఆరోగ్యశ్రీతో పేదలకు కార్పొరేట్‌ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చాం, ఆహార భద్రతతో పాటు ఆరోగ్య భద్రత ఇచ్చిన నేత సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇక, 2019 ఎన్నికల్లో జగనన్న హిస్టరీ క్రియేట్‌ చేశారు.. 2024 ఎన్నికల్లో హిస్టరీ రిపీట్‌ చేస్తారని తెలిపారు మంత్రి విడదల రజిని..

  • 08 Jul 2022 04:40 PM (IST)

    ప్రజల గుండెల్లో శాశ్వత చోటు కేసమే జగనన్న ప్రయత్నం..

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైఎస్‌ జగనన్న కృషి చరిత్రలో ఎవరూ చేయలేదన్నారు మంత్రి విడదల రజిని.. వైసీపీ ప్లీనరీ వేదికగా జగన్‌ సర్కార్‌ ప్రజా సంక్షేమ పథకాలను, రాష్ట్ర అభివృద్ధికి సీఎం చేస్తున్న కృషిని ప్రస్తావించిన ఆమె.. ఓట్ల కోసమే, సీట్ల కోసమే, నోట్ల కోసమో కాదు.. ప్రజల గుండెల్లో శాశ్వత చోటు కోసమే జగనన్న.. ప్రజల సమంక్షేమం కోపం పాటుపడుతున్నారని తెలిపారు. రాజనన్న పాలనను మించి ప్రతీ పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా జగనన్న కృషి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు మంత్రి విడదల రజిని.

  • 08 Jul 2022 03:36 PM (IST)

    విద్యారంగంపై తీర్మానం

    వైసీపీ ప్లీనరీలో విద్యారంగంపై తీర్మానం ప్రవేశపెట్టారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయన్న ఆయన.. ప్రైవేట్‌ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశామన్నారు.. విద్యా రంగాన్ని ప్రోత్సహించే విధంగా తీసుకొచ్చిన పథకాలు అమ్మ ఒడి, విద్యాదీవెన, జగనన్న గోరుముద్ధలాంటి పథకాలు ఎంతో దోహదం చేశాయన్నారు.

  • 08 Jul 2022 01:54 PM (IST)

    వైసీపీ జెండాలో పోరాటం.. పౌరుషం-- రోజా

    వైసీపీ ఫ్లీనరీలో ఆవేశంగా మాట్లాడారు మంత్రి రోజా. వైసీపీ జెండాలో పోరాటం వుంది. పౌరుషం వుందన్నారు రోజా. పోరాటాలు చేయడంలో రికార్డులు సృష్టించారు. అనంతరం అధికారంలోకి వచ్చాక కొత్త రికార్డులు నమోదుచేశారు. జగనన్న నాయకత్వంలో మహిళా సాధికారిత కోసం తీర్మానానికి నా మద్దతు ప్రకటిస్తున్నా. ప్రజల గుండెల్లో గుడికట్టుకున్నారు జగన్. ఆరోజు వైజాగ్ లో మహిళలకు బంగారు భవిష్యత్తు కలిగించారు. సోనియానే గడగడలాడించారు జగన్. సీఎం కూతురు మాస్టర్స్ డిగ్రీ సాధించినందుకు అభినందిస్తున్నా. తన కడుపున పుట్టినవారు ఎంత గౌరవంగా వుండాలని భావిస్తారో.. ఈ రాష్ట్రంలో పుట్టిన ఆడబిడ్డలు అలాగే వుండాలనుకుంటారు. మూడేళ్ళ పాలనలో మహిళల రక్షణకు అండగా వుంది జగన్.

  • 08 Jul 2022 01:24 PM (IST)

    అందరికీ అభివృద్ధి ఫలాలు.. మంత్రి ధర్మాన

    వైసీపీ ప్రభుత్వంలో అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చూస్తామన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్లీనరీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని వైఎస్సార్‌సీపీ పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. ప్రతి పేదవాడికి అండగా నిలవడమే వైఎస్సార్‌సీపీ సిద్ధాంతం. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదు. విద్య, వైద్యం అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలి. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను సీఎం జగన్‌ అందుబాటులోకి తెచ్చారని మంత్రి ధర్మాన అన్నారు.

  • 08 Jul 2022 01:22 PM (IST)

    మొదటి తీర్మానంగా మహిళా సాధికారత - దిశా చట్టం

    ప్లీనరీలో మొదటి తీర్మానంగా మహిళా సాధికారత - దిశా చట్టం ప్రవేశపెడతారు. మొదటి స్పీకర్ మంత్రి ఉషశ్రీ చరణ్, మిగిలిన స్పీకర్లు మంత్రి రోజా, లక్ష్మీ పార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి
    ఎమ్మెల్సీ పోతుల సునీత తీర్మానం ప్రవేశపెడతారు. రెండో అంశంగా విద్యపై తీర్మానం వుంటుంది. ఈ అంశంపై మాట్లాడనున్నారు ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సుధాకర్ బాబు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, తీర్మానం ప్రవేశపెట్టనున్నారు మంత్రి బొత్స,

    నవరత్నాలు -డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తీర్మానం వుంటుంది. డీబీటీ పై మాట్లాడనున్నారు మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, ఎమ్మెల్యేలు కొత్తగుళ్ళి భాగ్యలక్ష్మి. ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు చెవిరెడ్డి భాస్కర రెడ్డి. వైద్యం అంశంపై మాట్లాడనున్న మంత్రులు విడదల రజిని, సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని, తీర్మానం ప్రవేశపెట్టనున్నారు ఎమ్మెల్యే కోన రఘుపతి.

    పరిపాలనా- పారదర్శకత అంశంపై చర్చ వుంటుంది. ఈ అంశంపై మాట్లాడనున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యేలు బాలినేని, పుష్ప శ్రీవాణి, పార్థసారథి. డొక్కా మాణిక్య వరప్రసాద్ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సామాజిక సాధికారత అంశంపై అత్యధికంగా 9 మందికి మాట్లాడే అవకాశం వుంటుంది. సామాజిక సాధికారత అంశం పై మాట్లాడనున్న మంత్రులు తానేటి వనిత, మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణు, కార్మూరి నాగేశ్వరరావు, ఎంపీలు ఆర్.కృష్ణయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, సోషల్ జస్టిస్ అడ్వైజర్ జూపూడి. నాగులపల్లి ధనలక్ష్మి తీర్మానం ప్రవేశపెట్టనున్నారు .

    వ్యవసాయం పై మాట్లాడనున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కన్నబాబు, కరణం ధర్మశ్రీ, విశ్వేశ్వర రెడ్డి, అగ్రికల్చర్ మిషన్ నాగిరెడ్డి తీర్మానం ప్రవేశపెడతారు. పరిశ్రమలు- ఎంఎస్ఎంఈ ల పై తీర్మానం పై స్పీకర్స్ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, తీర్మానం ప్రవేశపెట్టనున్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. ప్లీనరీలో చివరి అంశంగా పచ్చ మీడియా- దుష్ట చతుష్టయం అంశం పై మాట్లాడనున్న మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి.

  • 08 Jul 2022 01:00 PM (IST)

    భారీగా ట్రాఫిక్ జాం.. కాలినడకన ప్లీనరీకి

    వైసీపీ ప్లీనరీకి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి తరలి వచ్చారు వైసీపీ కార్యకర్తలు.కాకాని నుంచి ప్లీనరీ వరకు కిక్కిరిసిన సర్వీస్ రోడ్ నిండిపోయింది. రెండు కిలో మీటర్ల మేర బారులు తీరాయి కార్లు, వాహనాలు. కాలినడకన ప్లీనరీ ప్రాగంణాన్ని చేరుకుంటున్నారు కార్యకర్తలు. సర్వీస్ రోడ్ నుంచి గుట్టెక్కి వచ్చి హైవే మీదకు వచ్చి ప్లీనరీకి వెళ్తోంది వైసీపీ క్యాడర్. ప్లీనరీ తర్వాత కార్యకర్తల్లో మరింత జోష్ వస్తుందంటున్నారు క్యాడర్.

  • 08 Jul 2022 12:57 PM (IST)

    పార్టీ జమాఖర్చుల స్టేట్ మెంట్

    పార్టీ జమాఖర్చుల ఆడిట్ స్టేట్ మెంట్ ని ప్రవేశపెట్టారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ స్టేట్ మెంట్ కి ప్లీనరీ ఆమోదం తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ నివేదిక అందచేస్తున్నా అన్నారు విజయసాయి రెడ్డి.

  • 08 Jul 2022 12:55 PM (IST)

    వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా

    వైసీపీ ప్లీనరీలో కీలక ప్రకటన చేశారు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ. వైసీపీ నుంచి నేను తప్పుకుంటున్నా అన్నారు. వైఎస్‌ జగన్‌ మాస్‌ లీడర్‌. యువతకు రోల్‌ మోడల్‌. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నా. పేద బిడ్డల భవిష్యత్‌ను జగన్‌ చూసుకుంటారని’’ వైఎస్‌ విజయమ్మ అన్నారు.

  • 08 Jul 2022 12:51 PM (IST)

    జగన్ రెండోసారి సీఎం అవుతాడు

    అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్న జగన్ మరోసారి సీఎం అవుతాడని నమ్మకం వుంది. రాజశేఖర్ రెడ్డి భార్యగా రెండు రాష్ట్రాల్లో తిరుగుతా. ఈ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగడం సరికాదు. నేను రాయని, నేను చేయని సంతకంతో లేఖ విడుదల చేశారు. ఎంత పిచ్చిరాతలు, దిగజారుడుతనం కనిపిస్తోంది. ఇలా రాసేవారికి నేను సమాధానం చెబుతున్నానన్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నా అన్నారు. తన రాజీనామాను ప్లీనరీ సాక్షిగా ప్రకటించారు విజయమ్మ.

  • 08 Jul 2022 12:48 PM (IST)

    తెలంగాణ కోడలిగా వైసీపీ టీపీ పెట్టింది.. విజయమ్మ

    తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలని షర్మిల పార్టీ పెట్టుకుంది. తెలంగాణలో గట్టి ప్రయత్నం చేస్తోంది. ఆ బిడ్డకు అండగా వుండాలి. రాజశేఖర్ రెడ్డి భార్యగా, షర్మిల తల్లిగా వుండాలి. ఇక్కడ జగన్, అక్కడ షర్మిలకు అండగా వుంటా. మీడియాలో గొప్పగొప్పగా నా గురించి రాశారు. జరిగింది ఒక ఎత్తు. రాబోయేది మరో ఎత్తు. తెలంగాణలో ముందుగా ఎన్నికలు వస్తాయి. షర్మిల తెలంగాణ ప్రయోజనాలు గురించి మాట్లాడుతుంది. జగన్ ఏపీ ప్రయోజనాలు గురించి మాట్లాడతారు. వైసీపీ అధ్యక్షుడిగా ఒక స్టాండ్ అవసరం. ఇద్దరూ వైఎస్ వారసులు. వేర్వేరు ప్రయోజనాలకు ప్రతినిధులు. ఎందుకొచ్చిందో తెలీదు. మంచికోసం దేవుడు జరిపిస్తున్నాడు. తన అన్నకు కష్టం కలగకూడదని షర్మిల భావించింది.

  • 08 Jul 2022 12:38 PM (IST)

    మీకు మాకూ వున్న బంధం 45 ఏళ్లది

    రాజశేఖర్ రెడ్డి నుంచి ఇప్పటివరకూ ఆదరించారు. రాజకీయ జీవితంలో మీకు మాత్రమే నేను జవాబు చెప్పాలి. రాజశేఖర్ రెడ్డిని పులివెందుల, కడప ప్రజలు మాతో వున్నారు. నాలో ప్రాణం వున్నంతవరకూ ప్రజలకు రుణపడి వుంటా. రాజశేఖర్ రెడ్డి మనిషి, మనిషిని ప్రేమించారు. తన మనసులో వున్న ఆలోచన అమలుచేశారు. ఆయన ఉన్నా లేకున్నా అవి కొనసాగుతున్నాయి. ఆయనంటే మీకు ఎంతో అభిమానం. రాజశేఖర్ రెడ్డి గారి మాట ఆదరణ, ఆయన చిరునవ్వు ధైర్యాన్ని ఇస్తుంది. ఏ ఒక్క రాజకీయనేతను 13 ఏళ్ల పాటు సజీవంగా వుంచుకున్నారు. రాజశేఖర్ రెడ్డిగారు 35 ఏళ్ళు పనిచేసిన పార్టీని వదిలేశారు. అప్పుడు ఆదరించింది, అక్కున చేర్చుకుంది మీరే అని చెబుతున్నా. జగన్ ఓదార్పుయాత్రకు వస్తే మీరే ఆయన్ని ఓదార్చారు. జగన్ కోసం వచ్చిన వారిని ఆదరించారు. మేం వున్నాం అని టీడీపీ ని ఓడించారు.షర్మిల పాదయాత్రకు పోయేటప్పుడు నాకు భయం వేసింది. ఒక బిడ్డ జైళ్ళో వుంటే.. మరో ఆడబిడ్డ రోడ్డుమీదకు వచ్చింది. ఆమె మూడువేల కిలోమీటర్లు నడిపించింది మీరే.

  • 08 Jul 2022 12:36 PM (IST)

    మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తాడు

    జగన్ మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తాడు. సంక్షేమం, అభివృద్ధి చేస్తారు. ఐదు వ్యవస్థలు సక్రమంగా వుండాలి. ప్రతి ఇంటికి ఐదు సంక్షేమాలు అందిస్తున్నాడు. విద్య, వైద్యం, ఆహారం, ఇవాళ విత్తనం వేశాడు. ఏపీని తలెత్తుకునేలా నిలబెడుతుందన్నారు. అభివృద్ధి ఎక్కడ వుందని అడిగితే.. ప్రజల జీవన శైలిని మార్చడం. ఆ ప్రభుత్వాలు ఏం చేశాయి? ప్రజల్ని ఎలా ముందుకి నడిపించారు. విజయవాడలో దుర్గా ఫ్లై ఓవర్లు జగన్ వచ్చాక పూర్తయింది. వైఎస్ ఎన్నో ఫ్లై ఓవర్లు కట్టారు. అలాంటి పాలన కావాలన్నారు విజయమ్మ.

  • 08 Jul 2022 12:31 PM (IST)

    విజన్ కలిగిన నేత జగన్

    మూడుదశాబ్దాలకు కావలసిన విజన్ నేత జగన్. రాజశేఖర్ రెడ్డి మాతో గడిపేవారు కాదు. నాలుగు ఇండస్ట్రీలు పెడదాం అన్నారు. నాన్నగారి లైఫ్ కావాలని కోరుకున్నాడు. మీ అందరి ప్రేమ, అభిమానం సంపాదించిన కొడుకుని చూసి గర్వపడుతున్నా. పార్టీ అధ్యక్షురాలిగా సంతోషంగా వుంది. మనసుతో పనిచేస్తాడు. రాజశేఖర్ రెడ్డి రోల్ మోడల్. ఎలాంటి వివక్ష లేకుండా పథకాలు అందుతున్నాయి. జనంలో వుండాలంటే అలాంటి నాయకత్వం కావాలి. దేశంలో ఇంత కష్టం పడ్డ కుటుంబం లేదు.

  • 08 Jul 2022 12:27 PM (IST)

    చెప్పినవి, చెప్పనవి కూడా చేశాం .. విజయమ్మ

    కాంగ్రెస్ పొమ్మనలేక పొగబెడితే,.. వైసీపీ పుట్టింది. పార్టీ అంటే ప్రజల అభిమానం. నేర్పు, గుండెల నిండా ధైర్యంతో, నేల తల్లి మీద గౌరవంతో జగన్ ఎదిగాడు. నాలుగున్నర దశాబ్దాల నేత గొంతు ఆరిపోయేలా చేశాడు. ప్రతిపక్షం ఏం చేస్తుందని ఫోకస్ పెట్టలేదు. ప్రజలకు న్యాయం చేయాలని భావించాడు. వాగ్దానాలు ఎన్నికలు వచ్చినప్పుడే అమలుచేస్తారు. లక్షల కోట్లు జనానికి అందించింది. గడపగడపకు ఈరోజు చేసిన పనులను చెబుతున్నాం. పెన్షన్ పెంచి ఇస్తున్నాం. వాలంట్రీలు, ప్రభుత్వ బడులు, మహిళలకు చేయూత,. ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు. ప్రతి అంశంలో విప్లవం తెచ్చాడు. రాజశేఖర్ రెడ్డి పథకాలు అన్నీ వున్నాయి.

  • 08 Jul 2022 12:21 PM (IST)

    ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న పార్టీ వైసీపీ

    రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఆదరించి వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా..అందరిలో రాజశేఖర్ రెడ్డి వున్నారు. అందుకే హ్యాపీ బర్త్ డే చెప్పారు విజయమ్మ. మూడోసారి ప్లీనరీ జరుపుకున్నాం. మూడవసారి ప్లీనరీ చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇది చేసిందని గర్వంగా చెబుతున్నా. నా బిడ్డతో సహా మీ అందరినీ ఆశీర్వదిస్తున్నా. పార్టీలు అధికారం కోసం పుడతాయి. రాజశేఖర్ రెడ్డి లేరంటే, రారంటే 700 మంది చనిపోయారు. వారి మమకారాల ఆధారంగా పార్టీ పుట్టింది. లక్షలాదిమంది వచ్చి మనల్ని ఓదార్చారు. మేం వున్నామని మీరు నా బిడ్డని ఎత్తుకున్నారు. భారతదేశంలో శక్తిమంతమయిన అధికార వ్యవస్థలు దాడిచేస్తే.. దానిని తట్టుకున్నాడు నా బిడ్డ. అరెస్టులు భయపెట్టినా దేనికీ లెక్కచేయలేదు. కష్టాలు, నష్టాలు, నిందలు వచ్చాయి. అనుకోకుండా అన్యాయమయిన కేసులు వచ్చాయి. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నో చేశారు.

  • 08 Jul 2022 12:14 PM (IST)

    మీతోడు నాకు కొండంత అండ .. జగన్

    కులాల కుంపట్లు, మతా మారణహోమాలు చేస్తున్పారు. వీళ్ల మాదిరిగా దత్తపుత్రుడి అండ నాకు వుండకపోవచ్చు. అది మీతోడు అని గర్వంగా చెబుతున్నానన్నారు. మనం ఆలోచించేందుకు, రాష్ట్ర ప్రజలకు తెలిపేందుకు తీర్మానాలు, ప్రసంగాలు ఉపయోపడతాయి.రేపు సుదీర్ఘంగా మాట్లాడుకుందాం అంటూ.. ప్లీనరీని ప్రారంభించారు సీఎం జగన్.

  • 08 Jul 2022 12:11 PM (IST)

    ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా.. జగన్

    2009 నుంచి 2019 వరకూ సాగిన పాలన, ఇక మీదట సాగబోయే పాలన గురించి వివరించారు. ప్రజాజీవితంలో మన పార్టీగా ఎలాంటి అడుగులు వేశాం. ఇంతటి మార్పు ఎప్పుడైనా చూశామా? అన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా, అసూయతో విమర్శలు, నిందలు చేస్తున్నారు. ఇచ్చిన మాటకు నిలబడడం విపక్షంలో వుందా. దుష్ట చతుష్టయం, గజ దొంగల ముఠాను చూశాం. ఇంటింటికీ, సామాజిక వర్గానికి న్యాయం చేశాం. మేనిఫెస్టోను అమలుచేసిన పార్టీ మనది. మోసం చేసిన వారు విమర్శలు చేస్తున్నారు. ఆయన పేరు చెబితే ఏ పథకానికీ కేరాఫ్ కాదు. ఆయన చేసే విమర్శలు, కట్టుకథల్ని, పచ్చిబూతుల్ని, అబద్ధాల్ని పత్రికలు, టీవీలు నడుపుతున్నారు. ఇదంతా మన ఖర్మ. అధికారాన్ని అడ్డుపెట్టుకుని గతంలో బాగా మెక్కేశారు, నొక్కేశారు. ఇప్పుడు గజదొంగల ముఠాకు నిద్రపట్టడం లేదు. వీరికి ఎన్ని జెలోసిల్ మాత్రలు ఇచ్చినా కడుపుమంట తగ్గదు. మనం జనం గుండెల్లో వున్నాం. ఆ గజదొంగల ముఠా ఎల్లో మీడియా, ఎల్లో పేపర్లలో వుంది. వారికి మనకు పోటీ ఎక్కడ? మనచేతల పాలనకు, చేతకాని వారి పాలనకు పోటీలేదు. వారి గుండెలు బద్ధలవుతున్నాయి. మన గెలుపు ఆపడం వారి తరం కాదు. రాక్షస గణాలు ఒక్కటవుతున్నాయి.

  • 08 Jul 2022 12:02 PM (IST)

    రాజకీయ, పాలనా వ్యవస్థలో మార్పుకు నాంది

    మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు అమలయ్యాయా అని అడిగితే వారు చిరునవ్వుతో ఆశీర్వదించారు.మన మేనిఫెస్టోలు చూడడానికి భయపడుతోంది టీడీపీ. చెప్పిన మాటకు కట్టుబడి వుందని వైసీపీ నిరూపించింది. వైసీపీ రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏంటో చూపించింది. గ్రామ పాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా, అవినీతికి, వివక్షకు తావులేకుండా చూపించింది. రైతులపై మమకారం అంటే ఏంటో చూపించింది. అన్నీ చేసి చూపించింది. పరిపాలన ఎలా వుంటుందో చూపించింది. అక్కచెల్లెమ్మల సాధికారిత చాటిచెప్పింది. పిల్లల భవిష్కత్తుని తీర్చిదిద్దేలా చూపించింది. వైద్యారోగ్య వ్యవస్థను చేసి చూపించింది. ప్రతి పేదవాడికి స్వంత ఇంటి కలను నిజం చేసి చూపించింది. లంచాలు, అవినీతి లేకుండా పారదర్శక పాలన ఇలా చేస్తారని చేసి చూపించింది వైసీపీ.

  • 08 Jul 2022 11:58 AM (IST)

    నా సంకల్పం చెదరలేదు.. నా గుండె బెదరలేదు

    ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నిందలు వేసినా.. మనం వెరవలేదు. నా గుండె బెదరలేదు, నా సంకల్పం చెదరలేదు.. నాన్నగారు చనిపోయాక జగమంత కుటుంబం ఏనాడూ నా చేయి విడవలేదు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కనివినీ ఎరుగని విధంగా మెజారిటీ ఇచ్చారు. 151 స్థానాలు మనం గెలిచాం. 23 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను కొన్నవారిని మాత్రం జనం గెలిపించారు. వారిని పరిమితం చేశాడు దేవుడు, ప్రజలంతా కలిసి. అధికారం అంటే అహం కారం. ప్రజల మీద మమకారం అంటూ నిరూపించారు. అధికారం వచ్చిన మూడేళ్ళ తర్వాత అయినా, ప్రజల కోసం, సామాన్యుడు, పేదల కోసం బతికాం. అన్ని ప్రాంతాలు, వర్గాల కోసం, అనుబంధాల కోసం బతికాం. చెప్పిన మాట నిలబెట్టేందుకు బతికాం. ఒకసారి గతాన్ని గుర్తుకుతెచ్చుకుంటే, మేనిఫెస్టోలు ఎన్నికలకే చేస్తారు, చెత్తబుట్లో పడేస్తారు. మేనిఫెస్టోను భగవద్దీత, బైబిల్, ఖురాన్ గా భావించాం. తన మేనిఫెస్టో చూపించడానికి తానే భయపడిన పార్టీ టీడీపీ. ఎవరికీ దొరకకుండా మాయంచేసింది ఆ పార్టీ. తన వాగ్దానాలను నిలదీస్తారోనని యూట్యూబ్, వెబ్ సైట్ నుంచి తీసేశారు.

  • 08 Jul 2022 11:53 AM (IST)

    అందరికీ సెల్యూట్.. జగన్

    ఎక్కడినించి మొదలు పెట్టాం.. ఎక్కడికి వచ్చాం. 2009 సెప్టెంబర్ 25న పావురాల గుట్టలో ప్రారంభమయిన సంఘర్షణ ఇలా సాగుతోంది. ఓదార్పుయాత్రతో రూపం సంతరించుకుంది. పార్టీగా ఆవిర్భవించింది. 11 ఏళ్ళ క్రితం పుట్టిన ఈ పార్టీ కోసం, నాన్నగారి ఆశయాల సాధన కోసం, మనందరి ఆత్మాభిమానం కోసం నన్ను అమితంగా ప్రేమించి వారందరికీ ధన్యవాదాలు. నాకు వెన్నుదన్నుగా వున్న అన్న, తమ్ముడికి, అక్కా,చెల్లెమ్మలకు, అవ్వ, తాతకు, కార్యకర్తకు, అభిమానికి ధన్యవాదాలు. మన జెండా తమ గుండెగా మార్చుకున్న యువతులకు, మనసున్న మనుషులకు ప్రేమ పూర్వకంగా, మీవాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబసభ్యుడిగా సెల్యూట్ చేస్తున్నా అన్నారు జగన్.

  • 08 Jul 2022 11:26 AM (IST)

    జెండాను ఆవిష్కరించిన జగన్

    వైసీపీ ప్లీనరీ సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు సీఎం జగన్. విజయమ్మ. అనంతరం అందరికీ అభివాదం చేసిన జగన్ జెండాను ఆవిష్కరించారు. ప్లీనరీ ప్రాంగణాన్ని చేరుకుంటున్నాయి వైసీపీ పార్టీ శ్రేణులు. వివిధ జిల్లాల నుంచి వస్తోన్న పార్టీ ప్రతినిధులతో కిక్కిరిశాయి రోడ్లు. వైసీపీ ప్లీనరీ వేదికపై జగన్, విజయమ్మ. ప్రారంభోపన్యాసం చేయనున్నారు జగన్.

     

    Jagan Vijayamma

  • 08 Jul 2022 11:24 AM (IST)

    95 శాతం హామీలు నెరవేర్చాం

    రాబోయే కాలంలో ఏం చేస్తాం అనేది ప్లీనరీలో చర్చిస్తామన్నారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. మూడేళ్ళ పాలనలో 95 శాతం హామీలు నెరవేర్చాం. గడపగడపకు జనం స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ప్రజలు ఆనందంగా వున్నారన్నారు. పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. కష్టపడిన వారిని ఆదుకుంటాం.

  • 08 Jul 2022 11:12 AM (IST)

    మళ్ళీ అధికారం మాదే..

    మూడేళ్ళ పాలనా కాలంలో అనేక పథకాలు అమలుచేశాం. ప్లీనరీకి లక్షలమంది తరలివచ్చారు. మరింత ఉత్సాహంతో పార్టీ ముందుకెళుతుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ జరుగుతోందన్నారు. సభా ప్రాంగణం నిండిపోయిందన్నారు వైసీపీ నేతలు. ప్లీనరీకి బ్రహ్మాండమయిన ఏర్పాట్లు చేశామన్నారు ఎమ్మెల్యే హఫీజ్. 5 చోట్ల భోజనం ఏర్పాట్లు చేశామన్నారు.

  • 08 Jul 2022 11:01 AM (IST)

    ప్లీనరీలో భలే విందు.. వెరైటీలతో పసందు

    అధికార వైసీపీ తన ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తోంది. ప్లీనరీకి వచ్చే కీలక నేతలతో పాటు కార్యకర్తలకు కూడా భలే విందు అందిస్తోంది. 2.5 లక్షల మందికి సరిపడేలా వంటకాలు సిద్ధం చేస్తున్నారు.. ఫుడ్‌ వడ్డించేందుకు ఏకంగా 250 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వడ్డించనున్నారు.. ఇక, ఫుడ్‌ మెనూ విషయానికి వస్తే.. 25 రకాల వంటలు చేస్తున్నారు.. వెజ్‌, నాన్‌వెజ్‌లో వెరైటీలు చేస్తున్నారు.. మటన్‌ థమ్‌ బిర్యాని, చికెన్‌ రోస్ట్‌, ఫ్రాన్‌ కర్రి, బొమ్మిడాయల పులుసు, చేపల పులుసు, కోడిగుడ్లు, వెజ్ బిర్యానీ, అవకాయ ఇలా మొత్తంగా 25 వెరైటీలు ఉంటాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఇప్పటికే తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వంటవాళ్ళు వీటిని ప్రిపేర్ చేస్తున్నారు.

  • 08 Jul 2022 10:37 AM (IST)

    మా పార్టీ పండుగ.. కార్యకర్తల వేడుక

    వైసీపీ ప్లీనరీ సమావేశం కార్యకర్తలకు పండుగ అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీలో అసహనం లేవు. ఇంత పెద్ద పార్టీలో చిన్నచిన్న అభిప్రాయభేదాలు సహజం. స్వచ్ఛందంగా తరలివస్తున్నారు జనం. ఎవరూ పెద్దగా ఇబ్బంది పడడం లేదు. వర్షం వస్తే కాస్త ఇబ్బంది తప్పదు. మేం వైసీపీ కార్యకర్తలం అని గర్వంగా చెప్పుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి నినాదాలు మా విధానాలు అంటున్నారు సజ్జల.

  • 08 Jul 2022 10:33 AM (IST)

    చంద్రబాబు పిచ్చోడు.. ఆయన్ని పట్టించుకోం

    ప్లీనరీ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు వైసీపీ నేతలు. కాసేపట్లో సీఎం జగన్ రానున్నారు. ప్లీనరీ పై చంద్రబాబు విమర్శల్ని తిప్పికొట్టారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విపక్షాల విమర్శలసై మండిపడ్డారు. తోక పత్రికలు, తోక ఛానెల్స్ దుష్ర్పచారం చేస్తున్నాయి. అప్పుల్లో పంజాబ్ మొదటి స్థానంలో వుంది. అప్పుల రాష్ట్రం అని దుష్ర్పచారం చేస్తున్నాయి. నిజాలు ఆర్థికమంత్రి ఇచ్చారు. చంద్రబాబుని పిచ్చోడిలా భావిస్తాం. అయన ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదు. అసభ్యకరమయిన పదజాలాన్ని చంద్రబాబు అండ్ టీం వాడుతున్నారు. మీకంటే రెండింతలు మేం మీపై ప్రచారం చేస్తాం. విలువైన రాజకీయాలు చేయాలి. ఏ పార్టీతో పొత్తులు వుండవు. ఎవరితోనూ కలిసి పనిచేయం.ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. రాజకీయంగా తీర్మానం అదే చేయబోతున్నాం.

  • 08 Jul 2022 10:14 AM (IST)

    కాసేపట్లో ప్లీనరీకి జగన్, విజయమ్మ

    గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు సీఎం జగన్, విజయమ్మ. కాసేపట్లో ప్లీనరీ సభా ప్రాంగణానికి చేరుకుంటారు జగన్, విజయమ్మ.

  • 08 Jul 2022 09:47 AM (IST)

    విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

    వైసీపీ ప్లీనరీ సందర్భంగా విజయవాడ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వైసీపీ ప్లీనరీ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ని మళ్ళిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా అడుగడుగునా పోలీస్ ల బందోబస్తు నిర్వహిస్తున్నారు. బస్సులు, కార్లలో వైసీపీ జెండాలతో భారీ సంఖ్యలో ప్లీనరీకి వెళ్తున్నారు కార్యకర్తలు. ఇవ్వాళ, రేపు నగరంలో కొనసాగనున్నాయి ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు వుంటాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఆంక్షలు అమలుచేస్తారు. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు తెనాలి, కొల్లూరు, పెనుమూడి వారధి, అవనిగడ్డ, పామర్రు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా మళ్ళించారు. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ప్రకాశం జిల్లా త్రోవగుంట నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా మళ్ళిస్తున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు హనుమాన్‌జంక్షన్‌ నుంచి ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ఇబ్రహీంపట్నం వద్ద నుండి హనుమాన్‌ జంక్షన్‌ వైపు మళ్ళిస్తున్నారు.

  • 08 Jul 2022 09:44 AM (IST)

    ప్లీనరీ దగ్గర వర్షం.. ఇబ్బందులు

    ఒకవైపు వైసీపీ ప్లీనరీ సమావేశానికి భారీగా తరలివచ్చారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. మరోవైపు ఆ ప్రాంతంలో వర్షం ప్రారంభం కావడంతో ప్లీనరీ ఏర్పాట్లకు ఇబ్బందికరంగా మారింది. ప్లీనరీకి వచ్చే లక్షలాదిమందికి టిఫిన్లు, భోజనాలు సిద్ధం చేస్తున్నారు వంటవాళ్ళు. అక్కడ వర్షం కారణంగా పనులకు అంతరాయం కలుగుతోంది.

  • 08 Jul 2022 09:36 AM (IST)

    సందడిగా ప్లీనరీ ప్రాంగణం

    వైసీపీ ప్లీనరీ ప్రాంగణం సందడిగా మారింది. కాసేపట్లో మంగళగిరి ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ప్లీనరీ వేదికకు సీఎం జగన్ వస్తారు. దీంతో ప్లీనరీ వేదికకు భారీ ఎత్తున చేరుకుంటున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. దీంతో ప్లీనరీ ప్రాంగణంలో వైసీపీ కార్యకర్తలు సందడి చేస్తున్నారు.

  • 08 Jul 2022 08:29 AM (IST)

    3 వేల మంది వాలంటీర్లు

    వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేశారు. దారులన్నీ ప్లీనరీ వైపు కనిపిస్తున్నాయి. ప్లీనరీలో 3 వేల మంది వాలంటీర్లు పాల్గొంటున్నారని ప్లీనరీ వలంటీర్స్‌ కమిటీ కన్వీనర్, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు.

  • 08 Jul 2022 08:16 AM (IST)

    2024 ఎన్నికలకు టార్గెట్ 175.. మంత్రి కారుమూరి

    వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో నేతలు పాల్గొంటున్నారు. 2017లో ప్లీనరీ తర్వాత 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించాం. ఈసారి 2024లో 175 సీట్లు సాధిస్తామంటున్నారు. వర్షం వున్నా ప్లీనరీ పండుగకు లక్షలాదిమంది తరలివస్తున్నారు. ప్రజల దగ్గరకు వెళ్ళలేని టీడీపీ నేతలు వైపీపీ పై విమర్శలు చేయడం ప్రజలకు నచ్చడం లేదంటున్నారు. జగన్ కుటుంబంలో అందరికీ దగ్గరయ్యారు. రాష్ట్రం అన్నివిధాలుగా ముందుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. జగన్ ప్రజల గురించి ఆలోచిస్తున్నారన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. .

  • 08 Jul 2022 08:14 AM (IST)

    వైఎస్ఆర్ కు ఘననివాళులు

    వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి వేడుకలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇడుపులపాయలోని వైఎస్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు సీఎం జగన్. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.అక్కడి నుంచి నేరుగా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానం వద్దకు చేరుకుని, ప్లీనరీలో పాల్గొననున్నారు.

    సీఎం జగన్ నివాళి

     

  • 08 Jul 2022 08:09 AM (IST)

    ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు

    నాగార్జున యూనివర్సిటీలో వైసీపీ ప్లీనరీకి భారీగా హాజరవుతున్నారు నాయకులు. సమావేశానికి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు. విజయవాడ - గుంటూరు హైవే పై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సమావేశాలకు లక్షల్లో పార్టీ అభిమానులు రానున్నారు.

  • 08 Jul 2022 07:36 AM (IST)

    మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ.. మిధున్ రెడ్డి

    వైసీపీ ప్లీనరీ మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ వేదికగా పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్ దిశానిర్దేశం ఉంటుందన్నారు ఎంపీ మిధున్ రెడ్డి. 2024 టార్గెట్‌గానే ఈ ప్లీనరీ ఉంటుందని తెలిపారు. గత ప్లీనరీ ఇక్కడే చేపట్టాం... అధికారంలోకి వచ్చామని, సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్‌ అవుతుంది, ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు మిథున్‌రెడ్డి. ప్రభుత్వంపై లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు సవాల్‌ విసిరారు మిథున్‌రెడ్డి.. అసలు ఏ విషయంలో అవినీతి జరిగిందో చంద్రబాబు ఆధారాలు బయటపెట్టగలరా? అంటూ చాలెంజ్ చేశారు.. నామినేషన్ వేసే ప్రతి ఒక్కరూ గెలుస్తాం అనే అనుకుంటారు... చంద్రబాబు వ్యాఖ్యలు కూడా అలాంటివే అంటూ ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.

  • 08 Jul 2022 07:36 AM (IST)

    రెండవ రోజు ఎజెండా ఇదే

    రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ప్లీనరీ సమావేశాలు

    10 గంటల నుంచి పది నిమిషాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు

    అనంతరం పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సందేశం

    10:30 కు సామాజిక సాధికారత అంశంపై తీర్మానం

    ఈ అంశం పై అత్యధికంగా ఏడుగురికి మాట్లాడే అవకాశం.. దాదాపు రెండు గంటల పాటు ఈ అంశం పై చర్చ

    సామాజిక సాధికారత అంశం పై మాట్లాడనున్న మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణు, కార్మూరి నాగేశ్వరరావు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యేలు ఆఫీస్ ఖాన్, నాగులపల్లి ధనలక్ష్మి, సోషల్ జస్టిస్ అడ్వైజర్ జూపూడి

    12:30 కు వ్యవసాయం పై తీర్మానం మాట్లాడనున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కన్నబాబు, కరణం ధర్మశ్రీ, అగ్రికల్చర్ మిషన్ నాగిరెడ్డి

    మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఎంఎస్ఎంఈ ల పై తీర్మానం.. ఈ అంశం పై ముగ్గురికి మాట్లాడే అవకాశం

    మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, బ్రహ్మనాయుడు

    ప్లీనరీలో చివరి అంశంగా పచ్చ మీడియా- దుష్ట చతుష్టయం అంశం పై మాట్లాడనున్న మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి

    సాయంత్రం మూడు గంటల 45 నిమిషాలకు అధ్యక్ష ఎన్నిక ప్రకటన ..ప్రకటించనున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

    సాయంత్రం నాలుగు గంటలకు అధ్యక్షుడు జగన్ ముగింపు ఉపన్యాసం.. గంటా 20 నిమిషాల పాటు ప్రసంగించనున్న జగన్

    కార్యకర్తలను, పార్టీని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్న జగన్..మూడేళ్ల పాలన, భవిష్యత్ ప్రణాళికను ప్రజల ముందు పెట్టనున్న జగన్

  • 08 Jul 2022 07:33 AM (IST)

    వివిధ తీర్మానాలు

    11 గంటల 45 నిమిషాలకు మొదటి తీర్మానంగా మహిళా సాధికారత దిశ చట్టం

    తీర్మానం పై మాట్లాడనున్న మంత్రులు ఉషశ్రీ చరణ్, రోజా , ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి

    రెండో అంశంగా ఒంటిగంటకు విద్య పై తీర్మానం

    ఈ అంశంపై మాట్లాడనున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సుధాకర్ బాబు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్

    రెండు గంటల 15 నిమిషాల నుంచి ఒక పావు గంట పాటు సాంస్కృతిక కార్యక్రమాలు

    మధ్యాహ్నం 2:30 కు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పై తీర్మానం

    డీబీటీ పై మాట్లాడనున్న మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, ఎమ్మెల్యేలు కొత్తగుళ్ళి భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి

    మూడు గంటల 15 నిమిషాలకు వైద్యం పై తీర్మానం

    వైద్యం అంశంపై మాట్లాడనున్న మంత్రులు విడదల రజిని, సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని

    సాయంత్రం నాలుగున్నరకు పరిపాలనా- పారదర్శకత అంశం పై చర్చస్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, పార్థసారథి

    సాయంత్రం ఐదు గంటలతో ముగియనున్న మొదటిరోజు ప్లీనరీ సమావేశం

  • 08 Jul 2022 07:32 AM (IST)

    వైసీపీ ప్లీనరీ ఎజెండా ఇదే

    ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ప్లీనరీ

    ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకూ సభ్యులు రిజిస్ట్రేషన్

    10 గంటల 10 నిమిషాలకు పార్టీ జెండా ఆవిష్కరించనున్న అధ్యక్షుడు జగన్

    10 గంటల 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్ధన

    10 గంటల 30 నిమిషాలకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు

    అనంతరం సర్వమత ప్రార్థనలు

    10.55 నిమిషాలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల

    ప్రకటన విడుదల చేయనున్న సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

    సరిగ్గా 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రారంభోపన్యాసం

    పార్టీ జమాఖర్చుల ఆడిట్ నివేదిక ప్రతిపాదన, ఆమోదం

    అనంతరం పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదన, ఆమోదం

    11:35 నుంచి 11.45 నిమిషాల వరకు పార్టీ కార్యక్రమాల నివేదన

  • 08 Jul 2022 07:26 AM (IST)

    ప్లీనరీ వేదిక‌కు వైయ‌స్ఆర్‌ ప్రాంగణంగా నామ‌క‌ర‌ణం

    వైసీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేశారు. గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా రేపు, ఎల్లుండి నిర్వహించనున్న వైయ‌స్ఆర్ సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాటు చేశారు. ప్లీనరీ వేదిక‌కు వైయ‌స్ఆర్‌ ప్రాంగణంగా నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు ప్లీన‌రీ క‌న్వీన‌ర్ త‌ల‌శీల ర‌ఘురామ్ తెలిపారు. ప్లీన‌రీ ప్రాంగ‌ణాన్ని మంత్రులు గురువారం పరిశీలించారు. ఈ రోజు సాయంత్రానికి నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు పాస్‌లు పంపిణీ చేయనున్నారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

     

Exit mobile version