ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధం అవుతోంది.. ఈనెల 8,9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఈ ప్లీనరీ నిర్వహించనుండగా.. పార్టీ ఆవిర్బావం తరువాత ఇది మూడో ప్లీనరీ.. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈ సమావేశాలు అయినా ఫుడ్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది.. సీఎం వైఎస్ జగన్ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు హాజరు కానున్న ఈ సమావేశాల్లో ఫుడ్ మెన్ ఆకర్షణగా నిలుస్తోంది.. 25 రకాల వంటకాలు సిద్ధం చేస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది.
Read Also: YSRCP Plenary 2022: వైసీపీ ప్లీనరీ.. భారీ భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు అమలు..
మొత్తం 2.5 లక్షల మందికి సరిపడేలా వంటకాలు సిద్ధం చేస్తున్నారు.. ఫుడ్ వడ్డించేందుకు ఏకంగా 250 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వడ్డించనున్నారు.. ఇక, ఫుడ్ మెనూ విషయానికి వస్తే.. 25 రకాల వంటలు చేస్తున్నారు.. వెజ్, నాన్‌వెజ్‌లో వెరైటీలు చేస్తున్నారు.. మటన్ థమ్ బిర్యాని, చికెన్ రోస్ట్, ఫ్రాన్ కర్రి, బొమ్మిడాయల పులుసు, చేపల పులుసు, కోడిగుడ్లు, వెజ్ బిర్యానీ, అవకాయ ఇలా మొత్తంగా 25 వెరైటీలు ఉంటాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.. ఫుడ్ మెనూను కింద పరిశీలించవచ్చు..