Site icon NTV Telugu

2024లో వైసీపీని మళ్లీ గెలిపించండి.. సాయిరెడ్డి విజ్ఞప్తి

Vijayasai-Reddy

Vijayasai-Reddy

2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని మరోసారి గెలిపించాల్సింది ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి… విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వార్డు, సీతమ్మదార నార్త్ ఎక్స్టెన్షన్ లో స్నీపర్ పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సాయిరెడ్డి.. మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గొల్లబాబురావు, జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి తదితరలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జీవీఎంసీ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అనేక హామీలు ఇచ్చాం.. మేం ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తాం అన్నారు. విశాఖలో 1000 పార్కులను, 216 చెరువులను అభివృద్ధి చేస్తామన్న ఆయన.. 794 మురికి వాడలను అభివృద్ధి చేయడమే కాకుండా ఇళ్ల పట్టాలు ఇస్తాం అన్నారు.. ప్రజా సంతోషమే ధ్యేయంగా పరిపాలన అందిస్తున్నామని.. 2024లో మా పార్టీని మరల గెలిపించాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేశారు.

ఇక, పెన్షన్ తీసేస్తున్నారంటూ కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాసరావు… ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంటే, బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అవినీతికి తావు లేకుండా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు.. మరోవైపు, సంక్షేమం, అభివృద్ధి సమానంగా సీఎం వైఎస్‌ జగన్‌… ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారని.. విశాఖపట్నం అభివృద్ధిపై వైసీపీ సర్కార్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు.

Exit mobile version