Site icon NTV Telugu

టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది.. అందుకే బాబులో అసహనం..!

తెలుగుదేశం పార్టీపై మరోసారి హాట్‌ కామెంట్లు చేశారు వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ వెంటిలేటర్ మీద వున్న పార్టీ అంటూ సెటైర్లు వేసిన ఆయన.. అందుకే చంద్రబాబు అసహనంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.. అందుకే బూతులు మాట్లాడిస్తూ.. కుంటసాకులతో దీక్షలు చేస్తూ.. రాజకీయలబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ఇక, టీడీపీ హయాంలో ప్రజా కంఠక పాలన సాగిందన్నారు సాయిరెడ్డి.. వైసీపీ పాలనలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డ ఆయన.. అందుకే ప్రభుత్వం చేసే మంచి చంద్రబాబుకి నెగెటివ్ గా కనిపిస్తోందన్నారు.. మరోవైపు నారా లోకేష్ అసహ్యకరమైన భాషతో ట్వీట్లు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సాయిరెడ్డి.. లోకేష్ ను సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని సూచించారు.

Exit mobile version