Site icon NTV Telugu

YSRCP: వైసీపీలో వెన్నుపోట్లు..! ఎంపీ, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Mp Sanjeev Kumar, Mla Hafeez Khan

Mp Sanjeev Kumar, Mla Hafeez Khan

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు, వెన్నుపోట్లపై ఆ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్‌యలు చేశారు.. కర్నూలులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సొంత పార్టీలో వెన్నుపోట్లపై నోరువిప్పారు.. పరోక్షంగా ఎస్వీ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు ఇద్దరు నేతలు.. కర్నూలు నియోజకవర్గంలో పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కు ద్రోహం చేస్తున్నారు అని మండిపడ్డ సంజీవ్‌ కుమార్.. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో హఫీజ్‌ ఖాన్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారనే ధీమా వ్యక్తం చేశారు. ఇక, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. పార్టీలో ఉంటూ కొంత మంది నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. నా పై కుట్రలు చేయాలని చూసినా నేను మాత్రం చిరునవ్వుతో ఓర్చుకుంటానని తెలిపారు.. నాకు ద్రోహం చేయాలని చూసినా అన్నీ భరిస్తాను, వచ్చే ఎన్నికల్లో ప్రజలు నాతో ఉంటారని ఆశిస్తున్నాను అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. కాగా, కర్నూలులో పలు నియోజకవర్గాల్లో వైసీపీలో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్‌ పదవులు పొందినవారు.. ఇలా కొందరు నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. కొన్ని సందర్భాల్లో ఆ విభేదాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి.

Read Also: Vladimir Putin: అలా చేస్తే ప్రతీకారం తప్పదు..ఫిన్లాండ్, స్వీడన్లకు వార్నింగ్

Exit mobile version