Site icon NTV Telugu

MP Reddeppa: దేశానికే సీఎం జగన్‌ రోల్‌ మోడల్‌..!

భారత దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ రోల్‌ మోడల్‌గా పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రెడ్డప్ప… ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఏడాదికి 75 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించిన ఆయన.. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.. ఇక, రైతులకు, కౌలుదారులకు ఏడాదికి రూ. 13500 రైతు భరోసా కల్పిస్తున్నారని వెల్లడించారు.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరిన ఎంపీ రెడ్డప్ప… రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధికంగా అతలాకుతలమైందన్నారు.. మరోవైపు.. ఏపీ విభజనకు చంద్రబాబు కారకుడంటూ ఫైర్‌ అయ్యారు.. ఆయన వల్లే సమస్యలు వచ్చాయని విమర్శించారు. ఇక, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నిధులు పెంచాలని డిమాండ్‌ చేశారు.. రైతులకు ప్రత్యేక బడ్జెట్ ఇవ్వాలని కోరారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రెడ్డప్ప.

Read Also: AP COVID: ఈ రోజు ఎన్నికేసులంటే..?

Exit mobile version