టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేవారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌లో బోధనలపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.. ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్న ఆయన.. చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఏ మీడియంలో చదివాడో చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇప్పుడు లోకేష్ కుమారుడు ఏ మీడియంలో చదువుతున్నాడు అని ప్రశ్నించిన మిథున్‌రెడ్డి.. చంద్రబాబు పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు.. పేదల పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌లో చదవకూడదా? ఇది దారుణం అన్నారు.. కేవలం తెలుగులో చదవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో.. ఇతర దేశాల్లో ఉద్యోగాలు ఎలా వస్తాయి? అని ప్రశ్నించిన ఆయన.. కేవలం సీఎం వైఎస్ జగన్ విమర్శించడానికి చంద్రబాబు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. విద్యకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు ఎంపీ మిథున్‌రెడ్డి.
చంద్రబాబుపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్
