పార్లమెంట్ లోపల, బయట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు మిథున్‌రెడ్డి… విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ధర్నాకు సంఘీభావం తెలిపిన ఆయన.. పరిరక్షణ కమిటీ పోరాటంలో పాలు పంచుకుంటామని తెలిపారు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తామని గుర్తుచేసిన ఆయన.. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మభిమానం అని పార్లమెంట్ లో స్పష్టం చేశామన్నారు.. ఇక, స్టీల్ ప్లాంట్‌కు గనులను కేంద్ర ప్రభుత్వమే కేటాయించాలని డిమాండ్ చేవారు మిథున్ రెడ్డి.. ఇప్పటికే స్టీల్ ప్లాంట్‌ను లాభాల్లో నడిపించడానికి ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పామన్నారు. కాగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదంటూ కేంద్రం ఇప్పటికే క్లియర్‌గా చెప్పగా.. మరోవైపు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం.. కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు.. బీజేపీ మినహా అన్ని పార్టీలు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతోన్న సంగతి తెలిసిందే.
పార్లమెంట్ లోపల బయట స్టీల్ ప్లాంట్‌పై పోరాటం..

Midhun Reddy