NTV Telugu Site icon

వారం రోజుల్లోనే ఎంపీ రఘురామకు నోటీసులు

ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రఘురామపై 290 పేజీల డాక్యుమెంట్‌ను స్పీకర్‌కు అందజేశామన్నారు. వారం రోజుల్లోనే రఘురామకు నోటీసులు వస్తాయని భావిస్తున్నామని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున చర్యగా ఫిర్యాదు చేశామన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా గుర్తుపై విజయం సాధించిన రఘురామకృష్ణంరాజు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనేది స్పష్టంగా సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించి సుమారు 290 పేజీలతో కూడిన డాక్యుమెంట్‌ను తమ పార్టీ పక్షాన స్పీకర్‌కు అందించామన్నారు. తాము ఇచ్చిన సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని స్పీకర్‌ ఆయనకు మరో వారం రోజుల్లోపే నోటీసు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్‌కు ఉన్న విచక్షణ అధికారాలతో వేటు వేస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.