Margani Bharat: ప్రత్యేక హోదాపై ప్రైవేటు మెంబర్ బిల్లు పెడతాం.. పార్లమెంటు సమావేశాల్లో టేబుల్ అవుతుందని ఆశిస్తున్నాం అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. బలహీన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సేవను గుర్తుచేస్తూనే.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. బీసీలతో పల్లకి మోయించుకున్న వ్యక్తి చంద్రబాబు.. కానీ, జగన్ బీసీలను బ్యాక్ బోన్ క్లాస్ గా చూస్తారని తెలిపారు. సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావు, సీఎం రమేష్ వంటి వ్యాపారవేత్తలనే చంద్రబాబు రాజ్యసభకు పంపించే వారని విమర్శించారు.. సీఎం వైఎస్ జగన్ మాత్రం బీసీల ఉద్యమకారుడు కృష్ణయ్య వంటి వారిని రాజ్యసభకు పంపించారని ప్రశంసలు కురిపించారు.. చంద్రబాబుది పెత్తందారీ విధానం.. జగన్ ది సామాజిక న్యాయ విధానంగా అభివర్ణించారు.
Read Also: Byreddy Rajasekhar Reddy: రాయలసీమ వెంటిలేటర్ మీద ఉంది.. బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే యువగళాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఎంపీ భరత్.. అసభ్య పదజాలం ఉపయోగిస్తే హైప్ వస్తుందని లోకేష్ అనుకుంటున్నాడు అని ఎద్దేవా చేశారు.. నాతో తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏ భాషలో అయినా పోటీ పడగలవా? అంటూ లోకేష్‌కు సవాల్ విసిరారు.. ఏ సబ్జెక్టు అయినా పోటీకి నేను సిద్ధం.. స్టాన్ ఫోర్డ్ అంటావుగా రా.. నాతో పోటీ పడు అని చాలెంజ్ చేశారు.. నీ స్థాయికి పోటీకి నేను చాలు.. ముఖ్యమంత్రిపై పోటీ పడటానికి నీకేం అర్హత ఉందని సెటైర్లు వేశారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు, లోకేష్ పొలిటికల్ టూరిస్ట్ లు అని వ్యాఖ్యానించారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ప్రైవేటు మెంబర్ బిల్లు పెడతాం.. పార్లమెంటు సమావేశాల్లో టేబుల్ అవుతుందని ఆశిస్తున్నామని వెల్లడించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్.