గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిపోయింది.. నియోజకవర్గానికి అదనపు ఇంఛార్జ్‌గా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె వర్గం జీర్ణించుకోలేకపోతోంది.. ఈ పరిణామంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదేమోనని ఆందోళనలో ఆమె ఉన్నారు.. డొక్కా మాణిక్యవరప్రసాద్ నియమాకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అనుచరులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం చర్చగా మారిపోయింది.. అయితే, ఈ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డొక్కా మాణిక్యవరప్రసాద్.
Read Also: Child Marriage: 62 ఏళ్ల అధికార పార్టీ నేత నిర్వాకం.. 16 ఏళ్ల బాలికతో పెళ్లి..!
తాడికొండ నియోజకవర్గంలో వివాదం తాత్కాలికమని తేల్చేశారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్.. ఎమ్మేల్యే శ్రీదేవితో వివాదం తాత్కాలికమేన్న ఆయన.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నాయకత్వంలోనే అందరం పని చేస్తామని స్పష్టం చేశారు.. తాడికొండ నియోజకవర్గంలో సమన్వయం కోసం నన్ను నియమించారని తెలిపిన ఆయన.. శ్రీదేవితో వున్న వివాదం తగ్గుముఖంపడుతుందని.. సమన్వయం చేసుకోని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్. కాగా, తాడికొండ అదనపు ఇంఛార్జ్‌గా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడంతో.. మొదట ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం ఆందోళనకు దిగింది.. ఆ తర్వాత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అనుచరులు కూడా రంగంలోకి దిగారు.. రెండు వర్గాలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. డొక్కాకు వ్యతిరేకంగా శ్రీదేవి అనుచరులు నినాదాలు చేస్తే.. శ్రీదేవికి వ్యతిరేకంగా డొక్కా వర్గీయులు నినాదాలు హోరెత్తించారు.. ఈ వ్యహారం మొత్తంగా అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది.