ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూశారు.. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఆయన.. గత నెల 25న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.. అయితే, నిన్న తెల్లవారుజాము నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది… వెంటిలేటర్ పై చికిత్స అందించారు వైద్యులు.. అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో చివరకు ఈ రోజు మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారని చెబుతున్నారు.. కాగా, 2020 డిసెంబర్ 31న చల్లా రామకృష్ణా రెడ్డి కరోనా బారినపడి మృతిచెందారు.. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్సీగా ఆయన కుమారుడైన భగీరథ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. ఇప్పుడు న్యుమోనియా వ్యాధితో బాధపడుతోన్న భగీరథ రెడ్డి కూడా కన్నుమూశారు.. దీంతో, చల్లా కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది… ఇక, రేపు తెల్లవారుజామున అవుకుకు భగీరథ రెడ్డి పార్థివదేహాన్ని తరలించనున్నారు.. రేపు సాయంత్రం అవుకులోని వాళ్లకు సంబంధించిన ఫామ్‌హౌస్‌లో చల్లా భగీరథ రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also: Petrol and Diesel Prices: ఎన్నికల ముందు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!