Site icon NTV Telugu

గజపతినగరంలో నల్లకండువాలతో జనాగ్రహ దీక్ష

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు చేసిన కామెంట్లు ఎంతటి దుమారం కలిగించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జనాగ్రహ దీక్షలు అంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నాలుగు రోడ్లు కూడలి వద్ద నల్లకండువాల తో వైఎస్సార్ పార్టీ జనాగ్రహ దీక్ష చేపట్టారు.

రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నాయకుల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గజపతినగరంలో నాయకులు పెద్ద ఎత్తున జనాగ్రహ దీక్ష చేపట్టారు . ఈ జనాగ్రహ దీక్షలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య . నియోజకవర్గ స్థాయి , మండల స్థాయి నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

ఈ సందర్భంగా గజపతినగరం ఎమ్మెల్యే అప్పలనరసయ్య టీడీపీపై నిప్పులు చెరిగారు. 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓటమిని జీర్ణించుకోలేక రాష్ట్రంలో అల్లర్లు సృష్టస్తున్నారన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రతి ఎన్నికల్లో ప్రజలు జగన్‌కి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ని తెలుగు దేశం పార్టీ కి చెందిన వారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు , ఇతర టీడీపీ నేతలు భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version