టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి… అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ.. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మరోవైపు.. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబాబు తీవ్రంగా స్పందించారు.. కోడెల వర్ధంతి కార్యక్రమంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా వెన్నకి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన.. అయ్యన్నపాత్రుడికి పిచ్చి పట్టిందని.. అధికారంకోల్పోయి అవాకులు చవాకులు పేలుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పట్టుకొని అసభ్య పదజాలం వాడుతున్నారని మండిపడ్డ ఆయన… మంత్రుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతికాదని హితవుపలికారు.. అయ్యన్నపాత్రుడుకి మతిభ్రమించి మాట్లాడుతున్నారు.. భాషను మార్చుకోవాలని సూచించిన అంబటి రాంబాబు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. ఇక, కోడెల శివప్రసాదరావు మరణానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబే కారణం అని ఆరోపించారు అంబటి.
అయ్యన్నపాత్రుడికి పిచ్చి పట్టింది.. చట్టపరమైన చర్యలు తప్పవు..!

Ambati Rambabu