Site icon NTV Telugu

YSRCP Formation Day: జగన్ 30ఏళ్ళు సీఎంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పార్టీ పెద్దలు.

అతి కొద్ది కాలంలోనే మనం అధికారంలోకి వచ్చాం. రాష్ట్ర ప్రజలంతా మన పార్టీ వైపు చూస్తున్నారు. నవరత్నాల్లాంటి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధి పధంలో నడుస్తోంది. ప్రతి కార్యకర్త కష్టమే పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం. వారందరినీ పార్టీ మర్చిపోదు.. అందరికీ సమన్యాయం జరుగుతుంది. పార్టీ బలోపేతానికి పునరంకితం అవుదాం. రానున్న రోజుల్లో పార్టీని అధికారంలో నిలబెట్టేలా కష్టపడదాం. వైఎస్ జగన్ మూడు దశాబ్దాలు సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,

ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడుస్తోంది. ఒక సమర్థమైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిరూపించుకున్నారు. మనమంతా ప్రజల కోసం సమైక్యంగా ముందుకు నడవాలి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా తుది దశకు వచ్చాయి. మన నాయకుడు ఆలోచన అందరికీ న్యాయం చేయడమే అన్నారు.

విజయవాడలో…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. నియోజకవర్గం లోని పలు డివిజన్లల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దేవినేని అవినాష్.

https://ntvtelugu.com/sajjala-ramakrishna-reddy-fires-on-chadrababu/

ప్రతిపక్ష నేతగా జగన్ సుదీర్ఘ కాలం పాటు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్న జగన్ ముఖ్యమంత్రి కాగానే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉన్నారు.

రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను స్మరించుకుంటూ వాడవాడలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక్క ఎంపీ ఒక్క ఎమ్మెల్యే తో మొదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం 151 ఎమ్మెల్యేలకు 22 ఎంపీలకు చేరింది. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తుంటే మరో ముప్పై సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండటం ఖాయంగా కనిపిస్తుందన్నారు దేవినేని అవినాష్.

Exit mobile version