Site icon NTV Telugu

YSRCP District Presidents: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుల నియామకం

ఏపీ సీఎం జగన్ మంత్రుల్ని జిల్లాలకు ఇన్‌ ఛార్జిలుగా నియమించాక.. జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్ల జాబితాను మంగళవారం ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మీడియా ముఖంగా వెల్లడించారు. మంత్రులుగా అవకాశం ఇవ్వలేని వారికి జిల్లా అధ్యక్షులుగా నియమించారు. కొందరు మాజీ మంత్రులకు జిల్లా అధ్యక్షుల బాధ్యతలు అప్పగించారు. చోటు కల్పించ లేని ఆశావహులకూ జిల్లా అధ్యక్ష బాధ్యతల అప్పగించడం ద్వారా వారిలోని అసమ్మతిని తగ్గించే ప్రయత్నం చేసింది పార్టీ. 11 మందికి రీజినల్ కో-ఆర్డినేటర్లుగా అవకాశం ఇచ్చారు.

26 జిల్లాలకు అధ్యక్షులు వీరే

1 .చిత్తూరు-కేఆర్కే భరత్
2 అనంతపురం-కాపు రామచంద్రారెడ్డి
3 శ్రీసత్యసాయి జిల్లా-ఎం.శంకర్ నారాయణ
4 అన్నమయ్య జిల్లా–గడికోట శ్రీకాంత్ రెడ్డి
5 కర్నూలు-వై.బాలనాగిరెడ్డి
6 నంద్యాల-కాటసాని రాంభూపాల్ రెడ్డి
7 వైఎస్సార్ కడప- కె.సురేష్ బాబు
8 తిరుపతి-చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
9 నెల్లూరు-వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
10 ప్రకాశం-బుర్రా మధుసూదన్ యాదవ్
11 బాపట్ల- మోపిదేవి వెంకటరమణ
12 గుంటూరు-మేకతోటి సుచరిత
13 పల్నాడు-పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
14 ఎన్టీఆర్ జిల్లా-వెల్లంపల్లి శ్రీనివాసరావు
15 కృష్ణా జిల్లా-పేర్ని నాని
16 ఏలూరు -ఆళ్ళ నాని
17 పశ్చిమగోదావరి-చెరుకువాడ శ్రీరంగనాథరాజు
18 తూర్పుగోదావరి-జగ్గంపూడి రాజ ఇంద్రవందిత్
19 కాకినాడ- కురసాల కన్నబాబు
20 కోనసీమ-పొన్నాడ వెంకట సతీష్ కుమార్
21 విశాఖపట్నం-ముత్తం శెట్టి శ్రీనివాసరావు
22 అనకాపల్లి- కరణం ధర్మశ్రీ
23 అల్లూరి సీతారామరాజు- కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ
24 పార్వతీపురం మన్యం- పాముల పుష్ప శ్రీవాణి
25 విజయనగరం- చిన్న శ్రీను
26 శ్రీకాకుళం -ధర్మాన కృష్ణదాస్

Read Also:Live: ఏపీలో జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రుల నియామకం

Exit mobile version