Site icon NTV Telugu

లోక్‌సభ.. పోలవరంపై వైసీపీ వాయిదా తీర్మానం

Parliament

Parliament

లోకసభలో పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై వాయిదా తీర్మానం ఇచ్చింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు వైసీపీ ఎంపీ చింతా అనురాధ… పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేయాలని నోటీసులో పేర్కొన్నారు.. అయితే, బుధవారం రోజు కేంద్ర జల శక్తి శాఖ క్లియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కాగా.. ఆర్థిక శాఖ నుంచి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపే వరకు పట్టు వదలకుండా పోరాటం చేస్తామంటున్నారు వైసీపీ ఎంపీలు.. మరోవైపు.. ఏపీ సర్కార్‌కు నిన్న గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ.. పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాల‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ ఆమోదం తెలిపింది. రూ.47,725 కోట్ల రూపాయ‌లకు పోల‌వ‌రం ప్రాజెక్టు అంచ‌నాల‌ను స‌వ‌రించారు. ఈ అంచ‌నాల‌ను అంగీక‌రిస్తున్నట్టు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్రసింగ్ షెకావ‌త్ తెలిపారు. స‌వ‌రించిన అంచ‌నాల‌కు సంబంధించిన ప్రతిపాద‌న‌ల‌ను ఇవాళ ఆర్ధిక శాఖ‌కు పంపించనున్నారు.

Exit mobile version