NTV Telugu Site icon

Andhra Pradesh: వైసీపీలో చేరి తప్పు చేశా.. పరిటాల సునీత కాళ్లపై పడ్డ కార్యకర్త

Paritala Sunitha

Paritala Sunitha

Andhra Pradesh: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ వైసీపీ కార్యకర్త మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై పడి క్షమించాలంటూ వేడుకున్నాడు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరి తప్పు చేశానంటూ వైసీపీ కార్యకర్త ముచ్చుమర్రి రామాంజనేయులు అభిప్రాయపడ్డాడు.

Read Also: Twitter Data Leak: చరిత్రలో అతిపెద్ద డేటా లీక్.. అమ్మకానికి 40 కోట్ల మంది వివరాలు

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పరిటాల సునీత ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ మేరకు రామాంజనేయులు ఇంటికి రాగానే ఆయన పరిటాల సునీత కాళ్లు పట్టుకున్నారు. తనను తిరిగి టీడీపీలో చేర్చుకోవాలని ప్రాధేయపడ్డాడు. అయితే జరిగిందేదో జరిగిందంటూ.. ఈ పార్టీలో ఎప్పటికీ మీ లాంటి వాళ్లకు చోటు ఉంటుందని పరిటాల సునీత రామాంజనేయులుకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. మనది తెలుగుదేశం అంటూ ఆప్యాయంగా మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారు.

Ysrcp

Show comments