Site icon NTV Telugu

YS Sunitha Reddy: వివేకా హత్య కేసుపై వైఎస్‌ సునీత సంచలన వ్యాఖ్యలు..

Ys Sunitha Reddy

Ys Sunitha Reddy

YS Sunitha Reddy: తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించింది.. అయితే, ఇటీవల ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్‌మెన్‌ రంగయ్య మృతిచెందడంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం.. రీపోస్టుమార్టం నిర్వహించడం.. దీనిపై దుమారం రేగడం చర్చగా మారింది.. ఇక, తన తండ్రి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ వివేకా కూతురు వైఎస్‌ సునీతారెడ్డి.. వైఎస్ వివేకానంద రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివేకానంద రెడ్డి హత్యకేసులో న్యాయం కోసం ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నాను.. ఒకరు తప్ప మిగిలిన వారంతా బయట లక్షణంగా ఉన్నారన్నారు..

Read Also: BRS: శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన..

ఇక, వైఎస్‌ వివేకా కేసులో ఇన్వెస్టిగేషన్ ఆగిపోయిందన్నారు వైఎస్ సునీత.. ఈ దారుణమైన హత్య గురించి పోరాడుతూనే ఉన్నా.. ఇంత అన్యాయం జరిగినా.. నాకు న్యాయం జరగలేదన్నారు.. అయినా, న్యాయపోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. ఎంతవరకైనా పోరాటం చేస్తానన్న సునీత.. నిందితుల కంటే మాకు, మా కుటుంబానికి ఎక్కువ శిక్ష పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. సీబీఐ మళ్లీ విచారణ మొదలు పెడుతుంది.. నాకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉందన్నారు.. మరోవైపు, నిందితులు సిస్టమ్‌ మేనేజ్ చేస్తున్నారు.. సాక్షులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాక్షులపై ఒత్తిడి జరుగుతోంది, అలా జరగకూడదు అన్నారు.. అయితే, సాక్షుల మరణాల వెనుక అనుమానాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ సునీతారెడ్డి..

Exit mobile version