Site icon NTV Telugu

YS Jagan Pulivendula Tour: పులివెందుల పర్యటనకు వైఎస్‌ జగన్‌.. రేపటి నుంచి మూడు రోజులు..

Ys Jagan

Ys Jagan

YS Jagan Pulivendula Tour: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మరో సారి తను ప్రాతినిథ్యం వహిస్తోన్న పులివెందుల నియోజకవర్గం పర్యటనకు సిద్ధమయ్యారు.. రేపటి నుంచి మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు జగన్‌.. 25వ తేదీ మధ్యాహ్నం పులివెందుల చేరుకుని క్యాంప్‌ కార్యాలయంలో రాత్రి 7 గంటల వరకు ప్రజా దర్భార్‌ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 26న ఉదయం పులివెందుల వాసవి ఫంక్షన్‌ హాల్‌లో జరిగే వివాహానికి హాజరవుతారు.. అక్కడి నుంచి బ్రహ్మణపల్లి వెళతారు. బ్రాహ్మణపల్లి అరటి తోటలను వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించి, అరటి రైతులతో మాట్లాడతారు. అక్కడినుంచి పులివెందుల చేరుకుని లింగాల మాజీ సర్పంచ్‌ మహేష్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం వేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళతారు.

Read Also: Ibomma Ravi : కన్ఫెషన్ రిపోర్ట్‌లో వెలుగులోకి సంచలన వివరాలు

అనంతరం అక్కడినుంచి పులివెందుల చేరుకుని క్యాంప్‌ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 27 ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి బెంగళూరుకు తిరుగు పయనమవుతారు. మూడు రోజుల పర్యటనలో ఇటీవల పులివెందులలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.. ఇదే, సందర్భంలో మహానాడు, మొన్నటి. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో, తరువాత వైసీపీ కార్యకర్తలు, నాయకులపై నమోదైన కేసులపై కూడా వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం ఉంది.. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు..

Exit mobile version