YS Jagan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రెండవ రోజు పులివెందులలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం పులివెందుల చేరుకున్నారు వైఎస్ జగన్.. ఇక, రెండో రోజు పర్యటనలో భాగంగా.. ఈ రోజు ఉదయం 9 గంటలకు పులివెందుల పట్టణంలోని గుంత బజార్ లో ఉన్న వైయస్సార్ పౌండేషన్ మరియు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునికరించిన వైయస్ రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభిస్తారు.. అనంతరం మధ్యాహ్నం 12. 20 గంటలకు పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నారు.. మార్చి 3 లేదా ఆ తర్వాత బెంగళూరు నుంచి తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారట వైఎస్ జగన్..
Read Also: VIJAY : నేడు విజయ్ ‘TVK’ పార్టీ రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్న విషయం విదితమే.. గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్ చేశారు.. ఇక, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు శాసన సభ సమావేశాలను హాజరుకాబోమంటూ వైఎస్ జగన్ స్పష్టం చేశారు.. ఇదే సమయంలో.. మండలిలో ఎక్కువ మంది సభ్యులు ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వాన్ని శాసన మండలి వేదికగా నిలదీయాలని నిర్ణయించారు.. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి హాజరవుతోన్న విషయం విదితమే.