YS Jagan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి తన సొంత జిల్లా.. కడప జిల్లాలో పర్యటించబోతున్నారు.. నేటి నుంచి రెండు రోజులు కడప జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.. రేపు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు జగన్.. ఇక, రెండు రోజుల పర్యటన కోసం.. ఈ రోజు సాయంత్రం 3.30 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 5.15 గంటలకు పులివెందులలోని తన నివాసానికి చేరుకుంటారు జగన్.. ఈ రోజు రాత్రికి పులివెందులలోనే బస చేస్తారు..
Read Also: Zim vs SA: వాళ్లకు కాస్త చెప్పండయ్యా.. అది టీ20 కాదు టెస్టు మ్యాచ్ అని.. ఆ కొట్టం ఏంటయ్యా బాబు..!
ఇక, రేపు ఉదయం 6.45 గంటలకు పులివెందులలోని తన స్వగృహం నుంచి వాహనంలో రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుంటారు వైఎస్ జగన్.. 8.15 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు.. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 8.45 గంటలకు పులివెందులలోని క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో ప్రజలను కలుస్తారు.. వారి నుంచి వినతులు స్వీకరిస్తారు.. అనంతరం పులివెందుల నుంచి 3.50 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు బెంగళూరు చేరుకుంటారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
