YS Jagan: ఇడుపులపాయకు వైఎస్‌ జగన్‌

  • ఇడుపులపాయకు వైఎస్ జగన్..
  • వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా..
  • వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్న జగన్..
Jagan

Jagan

YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.. నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించనున్నారు వైఎస్‌ జగన్‌?. ఉదయం 6.45 గంటలకు పులివెందులలోని తన స్వగృహం నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకున్న మాజీ సీఎం… ఉదయం 7.30 గంటల నుంచి ఉదయం 8.15 వరకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు.. వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పిస్తారు.. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 8.45 గంటలకు పులివెందులలోని క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు వైఎస్‌ జగన్‌.. అనంతరం పులివెందుల నుంచి సాయంత్రం 3.50 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు బెంగళూరు చేరుకుంటారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌..

Read Also: Russia Over Ukraine: తగ్గేదెలా.. అన్నట్టుగా ఉక్రెయిన్‌పై 100కిపైగా డ్రోన్లతో భారీ దాడి చేసిన రష్యా..!