కడప కార్పొరేషన్‌లో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ కడప ఎమ్మెల్యే మాధవి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ఎమ్మెల్యే కంప్లంట్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ జరిగింది. తాజాగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
ఇది కూడా చదవండి: Vizag: భర్త షికారుకి తీసుకెళ్లలేదని ఇల్లాలు అలక.. క్షణికావేశంలో ఆత్మహత్య
కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబుపై విజిలెన్స్ విచారణ ముగిసింది. కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని సంస్థకు కాంట్రాక్టులు ఇవ్వడంపై విచారణ జరిపారు. ఇక కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో తన సొంత వాహనానికి బిల్లులు చేసుకున్న వైనంపై కూడా విజిలెన్స్ ఆరా తీసింది. మున్సిపల్ చట్టం నిబంధనలను అతిక్రమించినందుకు పదవులకు అనర్హులవుతారనే సమాచారాన్ని కమిషనర్ ద్వారా మేయర్‌కు లేఖ అందించారు. మేయర్ సురేష్ బాబు సంజాయిషీ కోసం విజిలెన్స్ అధికారులు ఎదురుచూశారు. కానీ మేయర్ సురేష్ బాబు నుంచి ఎటువంటి సంజాయిషీ రాకపోవడంతో నివేదికను విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి పంపించారు.
ఇది కూడా చదవండి: Cigarette Price Hike: స్మోకింగ్ లవర్స్ కి షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్ల ధరలు!