కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. రాజుపాలెం వద్ద నదిలో మునిగి అక్క తమ్ముడు గల్లంతయ్యారు. స్నానం కోసం కుందూ నదిలో దిగి మస్తాన్(27), ఇమాంబి(28) లు మృతి చెందారు. కుందు నదిలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి అక్క తమ్ముడు మృతి చెందారు. మృతులు చాగలమర్రికి చెందినవారిగా గుర్తించారు.
Read Also: CM Jagan: చంద్రబాబు వాగ్దానాలకు, శకుని చేతిలో పాచికలకు తేడా లేదు..
వివరాల్లోకి వెళ్తే.. ఈరోజు ఉదయం ప్రొద్దుటూరులో స్వామిజి వద్దకు వెళ్లారు. వారి సమస్యలను స్వామిజీ చెప్పగా.. వారికి స్వామిజీ తాయత్తు ఇచ్చాడు. ఆ తాయత్తును నదిలో స్నానం చేసి కట్టువాలని సలహా ఇచ్చాడు. దీంతో.. అక్క తమ్ముడు ఇద్దరు కలిసి కుందు నది వద్దకు వచ్చి.. స్నానం చేసేందుకోసమని నీటిలోకి వెళ్లారు. అయితే.. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో వారిద్దరు నదిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం తెలియగానే కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ విషాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Rachana Banerjee: మందుకు బానిసై కెరీర్ నాశనం చేసుకున్న బ్యూటీ.. ఇప్పుడు ఎంపీగా పోటీ..?