YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ జరుగుతోంది.. అయితే, విచారణ పేరుతో మా కుటుంబాన్ని వేధిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసులో సాక్షిగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి భార్య పద్మావతి.. కడప జిల్లా పులివెందులలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన పద్మావతి.. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై పోలీసులు మళ్లీ మా కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.. విచారణ పేరుతో మా కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు.. కేసు విషయం పోలీసులు పొద్దుటూరు, బెంగళూరులో కలిశారని తెలిపారు.. అయితే, శ్రీనివాస్ రెడ్డి ఎందుకు చనిపోయాడు అనే విషయం లెటర్‌లో రాశారు.. శ్రీనివాస్ రెడ్డి రాసిన పేరుపై ఎంక్వైరీ చేయకుండా తన మేనల్లుళ్లను పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు మండిపడ్డారు..
Read Also: Disha Patani : సొగసులు ఉన్నాయి.. కానీ సినిమాలే లేవు.
అయితే, శ్రీనివాస్ రెడ్డి మృతికి కారణం సీఐ శ్రీరామ్ కారణం అని ఆరోపించారు పద్మావతి.. గంగాధర్, జగదీశ్వర్ రెడ్డి, రమణారెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు.. శ్రీనివాస్ రెడ్డిని మొదట్లో నిందితుడు అన్నారు.. తర్వాత అనుమానితుడు అని.. ఆ తర్వాత సాక్షి అన్నారి విమర్శించారు.. ఇలా ఒక్కొక్క సమయంలో ఒకోలా పోలీసులు వ్యవహరిస్తున్నారు.. నేను చెబితేనే నా మేనల్లుళ్లు తోట వద్దకు వెళ్లి.. నా భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు శ్రీనివాస్‌రెడ్డి భార్య పద్మావతి.